Rajendranagar : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. 30 సంవత్సరాల మహిళను కిడ్నాప్ చేసి, రేప్ చేసి, చివరకు హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో హైదరాబాద్ నగరంలో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు అత్తాపూర్‌లో అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను కిస్మత్‌పురలోని ఒక నిర్మాణస్య ప్రదేశానికి తీసుకెళ్లి రేప్‌కు పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళ మరింత అపస్మారక స్థితిలోకి వెళ్లేలా మత్తుమందు కూడా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Vidrohi : ఆసక్తికరంగా ‘విద్రోహి’ ట్రైలర్
రేప్ చేసిన అనంతరం మహిళను తిరిగి అత్తాపూర్ ప్రాంతానికి తీసుకొచ్చి పిల్లర్ నెంబర్ 340 వద్ద వదిలేసి దుర్గారెడ్డి వెళ్లిపోయాడు. దుర్గారెడ్డి వెళ్లిన తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడ చూసిన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు దస్తగిరి, ఇమ్రాన్ కిడ్నాప్ చేశారు. ఆటోలో ఎక్కించుకుని మళ్లీ కిస్మత్‌పురలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు.
ఈ సమయంలో మహిళ సహకరించలేదన్న కారణంతో ఇమ్రాన్, దస్తగిరి ఆమెను కొట్టి హత్య చేశారు. అనంతరం ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆమె వంటిపైన ఉన్న దుస్తులను తొలగించారు. మృతురాలు పాత బస్తీకి చెందిన 30 ఏళ్ల మహిళ అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దుర్గారెడ్డి, దస్తగిరి, ఇమ్రాన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరిపి, సాక్ష్యాధారాలతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.