Group1 : గ్రూప్-1 తీర్పుపై హైకోర్టులో మరోసారి అప్పీల్ దాఖలు
- HYD: గ్రూప్-1 తీర్పుపై హైకోర్టులో మరోసారి అప్పీల్ దాఖలు
- జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు తీర్పు కొట్టివేయాలని పిటిషన్
- గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి పిటిషన్‌ను స్వీకరించిన సీజే ధర్మాసనం
- TGPSC కూడా పిటిషన్ దాఖలు చేసిందన్న పిటిషనర్
- రెండు పిటిషన్లు కలిపి విచారణ చేస్తామన్న హైకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group1 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించిన గ్రూప్-1 నియామకాలపై కొనసాగుతున్న వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీలు చేసిన నేపథ్యంలో, తాజాగా గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
మార్చి 10న విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, ఈ నెల 9న కీలక తీర్పు ఇచ్చారు. ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు, మార్కుల జాబితాను రద్దు చేశారు. ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ వాదనలను సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటూ డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. ఫలితాలు సక్రమంగానే ఉన్నాయని, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలులోకి వస్తే నియామక ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని టీజీపీఎస్సీ వాదిస్తోంది.
తాజాగా, గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కూడా సింగిల్ బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ అప్పీల్ దాఖలు చేశారు. తన నియామకం చట్టబద్ధమని, ఇప్పటికే పొందిన హక్కును కోర్టు తీర్పుతో రద్దు చేయరాదని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్‌ను సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
ఒకవైపు టీజీపీఎస్సీ, మరోవైపు ఎంపికైన అభ్యర్థి చేసిన అప్పీల్స్‌తో గ్రూప్-1 వివాదం మరింత క్లిష్టంగా మారింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఏ తీర్పు ఇస్తుందో అన్నది రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులలో ఆసక్తిని రేపుతోంది. ఈ కేసు తుది పరిష్కారం వచ్చేంతవరకు నియామకాలు నిలిచిపోవడం ఖాయమని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
Italy: ఇటలీలో పాలస్తీనా ప్రకంపనలు.. హింసాత్మకంగా మారిన నిరసనలు
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!