యావత్తు ప్రపంచ దేశాలను అల్లకల్లలం చేసిన కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. రోజు రోజుకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 25,989 కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 477 మందికి పాజిటివ్ అని తేలింది. ఇదే సమయంలో 279 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే.. 43 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,960 కు చేరకుంది.
హైదరాబాద్ 258, రంగారెడ్డి జిల్లాల్లో 107, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 56 చొప్పు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 3,55,32,200ల కరోనా పరీక్షలు చేయగా.. 7,99,532మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 7,91,461 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 4111 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో రివకరీ రేటు 98.99 శాతం ఉండగా.. మరణాల రేటు 0.51శాతంగా ఉంది.