మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరకలు జరిగాయి. కొత్తగా పార్టీలోకి చేరిన వారికి గాంధీభవన్‌లో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ, కేసీఆర్ నీ బంగాళా ఖాతంలో వేస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆయన మండిపడ్డారు. ఆర్మీ ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం అంటున్నారని, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో యువత ఆందోళన చేసిందన్నారు. కాబోయే సైనికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జైల్లో పెట్టాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పుడు విధానాలతో జైల్లో పెట్టారని, ఈ దుర్మార్గం కి కేసీఆర్, మోడీల కారణమని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. మంత్రి ఎర్రబెల్లి…. సత్యవతి రాథోడ్‌లు కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ శవం మోయడానికి పోటీ పడ్డారని ఆయన ధ్వజమెత్తారు.
కానీ విద్యార్థుల కేసులపై ఎందుకు మాట్లాడటం లేదని, రోడ్ల మీద నాటకాలు ఆడి డ్రామాలు చేస్తుందని ఆయన విమర్శించారు. కన్న పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి బాధిత కుటుంబాల్లో ఉందని, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేసులో వారందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అడ్వకేట్ లను పెడతాం.. బెయిల్ వచ్చే వరకు అండగా ఉంటుందని, నీ కొడుకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నాం అని యశ్వంత్ సిన్హాకి సంతకం చేశారని, ఈ నాటకాలు నమ్మమన్నారు. అసెంబ్లీ సమావేశ పరిచి… అగ్నిపథ్‌కి వ్యతిరేక తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.