ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం తెలంగాణకు ఆలస్యమైంది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఏరువాకకు సిద్ధమైన రైతులు ఇటీవల కురిసిన వర్షాలకు పంట చేనులను దుక్కిదున్నుతున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా.. మరో గంటలో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వరకు ఆకాశమంతా మేఘావృతమై ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దీంతో హైదరాబాద్‌లోని పటాన్‌చెరు, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, బాలనగర్, బేగంపేట, అమీర్‌పేట, మల్కాజ్‌గిరి, కాప్రాతో పాటు పరిసరాల ప్రాంతాల్లో మరో గంటలో వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.