సిద్ధిపేట జిల్లా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం అనేది నా పదేళ్ల ప్రయత్నం 2018లో ఫలించిందని ఆయన అన్నారు. సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం నా కల నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. రూ.24 కోట్ల రూపాయల వ్యయంతో ఏన్సాన్‌పల్లిలో కేంద్రీయ విద్యాలయం కోసం నూతన భవన నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం […]
మరోసారి టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. వచ్చే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్‌లో పర్యటన, సభ సందర్భంగా కాంగ్రెస్ నేతల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మధు యాష్కీ మాట్లాడుతూ.. అగం అవుతున్న తెలంగాణను ఆదుకోవడం కోసమే రాహుల్ సభ అని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఏ వర్గంని మోసం చేశారో.. ఆ వర్గాలను ఏకం చేస్తామన్నారు. ఈ టీఆర్ఎస్ హౌలే […]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కు అస్వస్థతకు లోనైయ్యారు. 11 రోజులుగా మండు టెండలో పాదయాత్ర చేస్తుండటంతో వడదెబ్బ, ఎసిడిటీ (Acute Gastroenteritis) లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. పాదయాత్రకు కొంత విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. అయితే పాదయాత్ర చేసేందుకే బండి సంజయ్ మొగ్గు చూపినట్లు సమాచారం. డీహైడ్రేషన్, ఎసిడిటీ వల్ల బండి సంజయ్ కొంత బలహీనంగా వున్నారు […]
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ పార్టీ కాదని, దక్షిణాదిలో బీజేపీ లేదని ఆయన అన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ఉందా అని ఆయన అన్నారు. తెలంగాణలో ఏదో పొరపాటున 4 ఎంపీ సీట్లు గెలిచారన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ చిల్లర రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అని, […]
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అపర చాణిక్యుడైన కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ సాయం ఎందుకు కావాల్సి వచ్చిందనే ఎన్టీవీ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇస్తూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాడు 10 సంవత్సరాలు ఉన్న బాలుడు, రాబోయే సంవత్సరం, రెండు సంవత్సరాల్లో ఓటరు కాబోతున్నాడు. ఆ బాలుడికి కేసీఆర్ ఉద్యమ నాయకుడి కాకుండా ముఖ్యమంత్రిగానే తెలుసు అని, జనరేషన్ మారుతున్న కొద్దీ, […]
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది హైదరాబాద్‌లోని ప్రిజం పబ్. అయితే ఇప్పటికే పలు ఘటనల్లో ప్రిజం పబ్‌కు సంబంధం ఉంది. తాజాగా మరోసారి కస్టమర్‌పై దాడి చేసి ప్రిజం పబ్ వార్తల్లో నిలిచింది. పబ్‌కు వచ్చిన నంద కిషోర్ అనే వ్యక్తిపై ప్రిజం పబ్ బౌన్సర్లుతో కలిసి యాజమాన్యం పిడిగుద్దులు కురిపించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో నందకిషోర్ ఎన్టీవోతో మాట్లాడుతూ.. ‘మొదటిసారి ప్రిజం పబ్ కి వెళ్ళాను. అక్కడ నాన్ స్మోకింగ్ జోన్ […]
Former TPCC President Uttam Kumar Reddy Fired on BJP and TRS Governments. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులను కేసీర్, మోడీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన.. తుగ్లక్ పాలన లెక్క ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రబీలో 52 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.. ఇప్పుడు 35 లక్షల వరకు సాగు చేశారన్నారు. […]
వచ్చే నెల తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సీఎల్పీలో నేడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలు నమ్మే వాళ్ళందరూ రావాలని కోరుతున్నామని ఆయన పిలుపునిచ్చారు. రైతులు.. రైతు కూలీలు అంతా రాహుల్ సభకి […]
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నేడు మరోసారి భేటి అయ్యారు. నిన్న ఉదయం నుంచి పీకేతో సీఎం కేసీఆర్ సాయంత్రం వరకు చర్చలు జరిపారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో పీకే చేరబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ అదిష్టానంతో పీకే వరుసగా మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యల చేసిన […]