CM Jagan Adrressed at YSRCP Plenery 2022.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్లీనరీ వేడుకలు గుంటూరు వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలో గల దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్ గుంటూరు చేరుకున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో వైసీపీ జెండాను ఆవిష్కరించి వైసీపీ ప్లీనరీ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జనగ్ ప్రసంగిస్తూ.. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిందలు వేసినా.. మనం వెరవలేదు. నా గుండె బెదరలేదు, నా సంకల్పం చెదరలేదు.. నాన్నగారు చనిపోయాక జగమంత కుటుంబం ఏనాడూ నా చేయి విడవలేదు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కనివినీ ఎరుగని విధంగా మెజారిటీ ఇచ్చారు. 151 స్థానాలు మనం గెలిచాం. 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను కొన్నవారిని మాత్రం జనం గెలిపించారు.
Big News : వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా
వారిని పరిమితం చేశాడు దేవుడు, ప్రజలంతా కలిసి. అధికారం అంటే అహం కారం. ప్రజల మీద మమకారం అంటూ నిరూపించారు. అధికారం వచ్చిన మూడేళ్ళ తర్వాత అయినా, ప్రజల కోసం, సామాన్యుడు, పేదల కోసం బతికాం. అన్ని ప్రాంతాలు, వర్గాల కోసం, అనుబంధాల కోసం బతికాం. చెప్పిన మాట నిలబెట్టేందుకు బతికాం. ఒకసారి గతాన్ని గుర్తుకుతెచ్చుకుంటే, మేనిఫెస్టోలు ఎన్నికలకే చేస్తారు, చెత్తబుట్లో పడేస్తారు. మేనిఫెస్టోను భగవద్దీత, బైబిల్, ఖురాన్ గా భావించాం. తన మేనిఫెస్టో చూపించడానికి తానే భయపడిన పార్టీ టీడీపీ. ఎవరికీ దొరకకుండా మాయంచేసింది ఆ పార్టీ. తన వాగ్దానాలను నిలదీస్తారోనని యూట్యూబ్, వెబ్ సైట్ నుంచి తీసేశారని ఆయన వ్యా్ఖ్యానించారు.