India vs England : దుమ్ములేపిన హర్దిక్ పాండ్యా.. భారత్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాంప్టన్ వేదికగా నిన్న రాత్రి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్ టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకొంది. అయితే ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా మెరిసాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగి టీమిండియా జట్టు 8 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లకు 148 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు తన బౌలింగ్‌తో హార్దిక్ పాండ్యా చుక్కులు చూపించాడు. దీంతో వరుసగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు వికెట్లను కోల్పొయి పెవిలియన్ చేరారు. మొయిన్ అలీ చేసిన 36 పరుగులే ఆ జట్టులో అత్యధికం కాగా.. డేవిడ్ మలాన్ (21), హారీ బ్రూక్ (28), క్రిస్ జోర్డాన్ (26) పరుగులు చేసి వెనుదిరిగారు.
కెప్టెన్ జోస్ బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్, మాథ్యూ పార్కిన్సన్ డకౌట్ కాగా, జాసన్ రాయ్ 4, శామ్ కరన్ 4, టైమల్ మిల్స్ 7, రీస్ టోప్లే 9 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది. హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 51 పరుగులు చేయగా, దీపక్ హుడా 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33, సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశారు.
Also Read
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
- Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
కెప్టెన్ రోహిత్ శర్మ 14 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 17, దినేశ్ కార్తీక్ 11 పరుగులు చేశాడు. ఇంగ్లిష్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో టీమిండియా ఇంగ్లాండ్‌పై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. రెండో టీ20 ఎడ్జ్‌బాస్టన్‌లో రేపు జరుగుతుంది.
తాజావార్తలు
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!