ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శామ్ సంగ్ కొత్తగా భారతదేశ మార్కెట్లోకి 4కే టీవీని ప్రవేశపెట్టింది. డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు అడాప్టివ్ సౌండ్ టెక్నాలజీతో వస్తున్న క్రిస్టల్ 4K నియో టీవీని శామ్ సంగ్ సోమవారం భారతదేశంలో విడుదల చేసింది. కొత్త క్రిస్టల్ 4K నియో టీవీ 43-అంగుళాల స్క్రీన్ వేరియంట్లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 35,990లుగా ఉంది. క్రిస్టల్ టెక్నాలజీ క్రిస్టల్ డిస్ప్లేతో స్ఫుటమైన చిత్రాలను అందిస్తుంది. “క్రిస్టల్ 4K నియో టీవీ […]
రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్రతో సాగుతోన్న మైహోం గ్రూప్ ఫ్రాంచేజీ నుంచి వచ్చిన మైహోం సయూక్ ప్రాజెక్ట్ సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్ ఎస్టే్ట్ రంగంలో తన పరంపర కొనసాగిస్తున్న.. మైహోం ఇటీవల రియల్ రాజ్యంలోకి సయూక్ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. అయితే.. ఈ సయూక్ ప్రాజెక్టులో మునుపెన్నడూ లేనివిధంగా బుకింగ్స్ జరిగాయి. అయితే.. తాజాగా సయూక్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అమ్మకాలు ప్రారంభం కావడంతో కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,125 […]
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి 100కు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. క్రమంగా కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13,015 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 126 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 75 కేసులు వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో […]
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్‌లు చట్టరిత్యా నేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఐ అండ్ మినిస్ట్రీ అడ్వైజరీ పేర్కొంది. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ మీడియా సంస్థలు సంబధిత యాడ్స్‌ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు థర్డ్ పార్టీ ఆన్లైన్ […]
మియాపూర్ పీయస్ పరిధిలో ఆయుధాలతో పట్టుబడిన పాత నేరస్తులు పట్టబడ్డారు. అయితే ముగ్గురిని అరెస్ట్ చేయగా.. బీహార్‌కు చెందిన ఒకరు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక తపంచా, ఒక కంట్రీ మేడ్ పిస్టల్, రెండు మ్యాగ్జీన్ లు, 13 బుల్లెట్లు, ఒక బైక్, ఒక కారు, ఆరు మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. మాదాపూర్ డీసీపీ శిల్పవళ్లి మాట్లాడుతూ.. కొంతమంది వెపన్స్ తో మంజీరా పైప్ లైన్ రోడ్డు లో తిరుగుతున్నారనీ నిన్న ఉదయం 10 గంటలకు […]
మాజీ బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ఇటీవల మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాకుండా ముస్లిం దేశాలలో సైతం ఆగ్రహజ్వాలలు రగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నుపుర్ శర్మ వ్యాఖ్యలపై కువైట్‌లో ప్రవాసులు నిరసనలు చేపట్టారు. దీంతో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిరసనకారులకు హెచ్చిరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో వారిని అరెస్ట్ చేసిన జైళ్లకు తరలిస్తున్నారు. తమ దేశంలో ప్రవాసులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం […]
బుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు కొందరు కొందరు చేసే పనులు చూస్తుంటే చేసేవారికి ఎలాగుంటుందో తెలియదు గానీ.. చూసే వారికి మాత్రం ఒళ్లు మండుతుంది. విషయం ఏంటంటే.. కొందరు యువకులు కదులుతున్న రైలు బోగీలు ఎక్కి స్టంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో వారి తీరుపై కొందరు విమర్శలు గుప్పిస్తుంటే.. మరి కొందరు వెరైటీగా స్పందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక లోకల్ రైలు విలియమ్స్బర్గ్ […]
భారత భూగంలోకి అక్రమంగా ప్రవేశించి ఇద్దరు చైనీయులను సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ) అరెస్ట్ చేసింది. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలోని భితామోర్ బోర్డర్ అవుట్‌పోస్ట్ నుంచి నేపాల్‌లోకి ఆదివారం సాయంత్రం అక్రమంగా ప్రవేశిస్తున్న చైనా జాతీయులు యుంగ్ హై లంగ్ (34), లో లంగ్ (28)ను తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఎస్బీ కమాండర్ రాజన్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. వారి వద్ద ఎలాంటి అధికార పత్రాలు లేకపోవడంతో భారత్‌లోకి అక్రమ ప్రవేశం, ఆర్థిక మోసాలకు సంబంధించి […]
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం కొంత ఆలస్యమైన వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంకా రాకపోవడంతో ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతన్నల్లో కొంత ఆందోళన నెలకొంది. అంతేకాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపాగ్నిలో ఉడికిపోతున్న తెలంగాణ వాసులు సైతం నైరుతు రుతుపవనాల కోసం చూస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయని వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో […]
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంకి నోటీసులు ఇవ్వడం అంటే.. దేశం నీ అవమానించడమేనని, గాంధీ కుటుంబంకి జరిగిన అవమానం కాదు.. దేశ ప్రజలకు జరిగిన అవమానంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఇందిరాగాంధీపై […]