వర్గల్ మండలంలోని తనికి ఖల్సా గ్రామంలో నూతనంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కొందరిని కలిశానని, వాళ్ళది గుత్తి, అనంతపురం అని చెప్పారు. అయితే.. మీ దగ్గర కరెంట్ ఎంత సేపు వస్తుందని అడిగితే.. ఉదయం మూడు గంటలు రాత్రి నాలుగు గంటలకు వస్తుందని చెప్పారని మంత్రి హరీష్ రావు అన్నారు. మళ్ళీ గంట గంటకి కరెంటు పోతుందని చెప్పారని, అక్కడి కంటే మన తెలంగాణలోనే నయం అన్నారు మంత్రి హరీష్‌రావు. అంతేకాకుండా.. తెలంగాణ రాక ముందు పెన్షన్ రూ.200, రూ.500లే ఉండేనని, కానీ .. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పెన్షన్‌లు అందిస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ దక్షతతో చేస్తున్న అభివృద్ధి ఇతర పార్టీల నాయకులు కంటికి కనిపించడం లేదని, అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ వచ్చినాకే పండుగలను ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నామని, బతుకమ్మ పండుగా ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు.