ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరుగనున్నది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండగా.. ఈ స్టేడియంలో ఇది మూడో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం. అయితే.. తొలి రెండు మ్యాచుల్లో.. చెరొకటి గెలుచుకోవడంతో.. ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది. దీంతో.. ఈ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. ఉప్పల్ స్టేడియంలో 55వేల మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ క్రమంలోనే.. మ్యాచ్‌కు పోలీసులు భారీ బలగాలను మోహరించారు. మైదానం వద్ద 2,500 మంది పోలీసులతో భద్రత కల్పించారు. స్టేడియం చుట్టుపక్కల 15కిలోమీటర్ల మేర నిఘావేశారు పోలీసులు. సుమారు 300 సీసీకెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూంతో అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు. అయితే ముందు నుంచి ఈ మ్యాచ్‌కు టికెట్ల విషయం పెద్ద సమస్యగానే మారింది. టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారని హెచ్‌సీఏపై ఆరోపణలు వచ్చాయి.
జింఖానా గ్రౌండ్స్ వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో రాష్ట్ర ప్రభుత్వం మందలించడంతో.. హెచ్‌సీఏ దిగి వచ్చింది. దీంతో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. ఇదిలా ఉంటే.. ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలో బ్లాక్ లో టిక్కెట్లు విక్రయాలు జరుపుతున్న గుగులోత్ వెంకటేష్, ఇస్లవత్ దయాకర్, గుగులోత్ అరుణ్ అనే ముగ్గురు యువకులను ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 850ల టిక్కెట్ ను రూ.11,000లకి అమ్ముతుండగా పట్టుకున్న ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి.. ఆరు టిక్కెట్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం, ఉప్పల్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు.