నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. భాగ్యనగరం కాంగ్రెస్ శ్రేణుల నిరసనగాలో అట్టుడికిపోయింది. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టిడికి యత్నించగా.. పోలీసులు వారి పథకాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ సర్కిల్ వద్ద బైక్‌కు నిప్పుపెట్టి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. […]
హైదరాబాదు నగర పరిధిలోని పోలీశ్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. నగరంలోని 2865 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ ఆనంద్ ఉత్వర్వులు జారీ చేశారు. పోలీసు కానిస్టేబుల్స్-2006, హెడ్ కానిస్టేబుల్-640, ఏఎస్ఐలు -219 మందిని బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కోవిడ్ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా వీరి బదిలీలు పెండింగ్ ఉన్నట్లు ఆయన తెలిపారు. 5 నుండి 7 సంవత్సరములు లాంగ్ స్టాండింగ్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆన్ లైన్ […]
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. గురువారం కొడంగల్‌లో పర్యటించిన హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి గడప దాటలేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఇక్కడ అభివృద్ధి చేయలేక పోయారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్త రూపు సంతరించుకున్నదని, రేపో మాపో పాలమూరు నీళ్ళు తెచ్చి మీ పాదాలు కడుగుతామన్నారు. పాలమూరు పై […]
పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి ఒప్పించాలిసింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులుకు గురి చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గౌరవెల్లి ప్రజలు ప్రాజెక్ట్ కి సహకరిస్తామని చెప్పారని అయినా.. అర్థరాత్రి వందలాది మంది పోలీస్ లు ఇళ్ళ నుండి ఈడ్చుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టారని ఆయన మండిపడ్డారు. నిర్వాసితులపై పోలీసుల లాఠీ ఛార్జీ దారుణమని, గతంలో కూడా రాత్రికి రాత్రే వీరిపై దాడి చేసి రోడ్ మీద పడేశారని ఆయన అగ్రహం […]
కరోనా మహమ్మారి మరోసారి తెలంగాణలో విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి సెంచరీ కొట్టిన కరోనా కేసులు సంఖ్య.. తాజాగా డబుల్ సెంచరీ కొట్టింది. గడిచిన 24 గంటల్లో 22,662 కరోనా పరీక్షలు నిర్వహించగా, 219 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు చొప్పున కరోనా కేసులు నమోదుయ్యాయి. అలాగే ఒక్కరోజు 76 మంది […]
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ, లబ్దిదారులకు దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడు కోట్లు మంజూరైనట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా గురుకుల పాఠశాలలో సుమారుగా నాలుగు లక్షల మంది పిల్లలు చదువుతున్నారని, 12 వందల కోట్లతో పాఠశాలకు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్య శాఖలో త్వరలో 20 వేల […]
పూర్తిగా తెగి క్రింద పడిన ఎడమ అరచేయిని అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన శస్త్రచికిత్సతో శరీరానికి అతికించడం ద్వారా ఓ యువకునికి నూతన జీవితం ప్రసాదించిన మెడికవర్ వైద్యులు కేతారామ్ 18 సంవత్సరాల వయస్సు మరియు రాజస్థాన్ నివాసి 4-6-2022న పదునైన యంత్రాలు-అల్యూమినియం కట్టింగ్ మెషిన్‌తో పని చేస్తున్నాడు . సాయంత్రం 7 గంటలకు అతని ఎడమ చేయి ప్రమాదవశాత్తూ మెషిన్ లో పడి పూర్తిగా అరచేయిబాగం తెగిపోయి కిందపడటం జరిగింది. తక్షణమే అతని సమస్యకు తగిన పరిష్కారం […]
ప్రజల్లో చైతన్యం పెంచడానికి వరల్డ్ డోనర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదాన కార్యక్రమాల్లో నలుగురు ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా ఉన్నారన్న మంత్రి హరీష్ రావు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 18 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. 1000 యూనిట్స్ తక్కువ కాకుండా అందించారని, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నో యూనిట్స్ బ్లడ్ అందించారన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి 7100 యూనిట్స్ రక్తాన్ని అందించారని, […]
సిద్దిపేటలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, నల్గొండ జిల్లాకు నేను వెళ్తే నాకు అక్కడ ప్రజలు బ్రహ్మరతం పడితే.. కేసీఆర్ చానెల్, పేపర్ ఖాళీ కుర్చీలు చూపించాయి.. ఆ చానెల్ని ఎవరూ చూడరు వారు తప్ప అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ […]
బాసర ట్రిపుల్ ఐటీకి శాశ్వత వైస్ ఛాన్సలర్‌ను వెంటనే నియమించి, విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి బాసర ట్రిపుల్ ఐటీ లోపల చేసిన శాంతియుత పోరాటాన్ని పోలీసులు భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ […]