అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. క్రమంగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ కాగా, 5,24,761 మంది మరణించారు. మరో 44,513 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. […]
తీగ లాగితే డొంక కదిలిందే అనే సామెత మనం వినే ఉంటాం. అలాంటి సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కొందరు దుండగులు ఏటీఎం నుంచి రూ.18 లక్షలు లూటీ చేసి పరారయ్యారు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ ఇస్మాయిల్ కితాబ్ అలీ అనే బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. అయితే.. విచారణలో అతడు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 2011 […]
మానవాళికి జంతువులకు వీడిదీయలేని అనుంబంధం ఉంది. సింహం లాంటి మాంసాహార జంతువులు సైతం మనుషుల మధ్య పెరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీడియోలు మనం చూస్తునే ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు జంతువులలో ఉన్న మేథాశక్తి బయటపడుతుంటుంది. వాటి మేథాశక్తి ముందు కొన్ని సార్లు మనుషులు మెదడు తక్కువే అనిపిస్తుంటుంది. అయితే ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఓ ఎలుగుబంటి చేసిన పని అలాంటిది మరీ.. ఓ ఎలుగుబంటి పడిపోయిన ట్రాఫిక్ కోన్ కనిపించగానే సరిచేసి వెళ్లిన […]
న్యూఢిల్లీలో కోరల్ బాగ్‌లోని గఫార్ మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. అయితే ఇది గమనించిన స్థానికులు పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 39 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు […]
మద్యం సేవించి వాహనాలు నడిపడంతో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. ముమ్మాటికీ మద్యం సేవించి వాహనం నడపడం తప్పేనని కోర్టులు, పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తునప్పటికీ కొందురు మందుబాబులు మాత్రం మారడం లేదు. అయితే.. ఏపీలో ఓ వ్యక్తి దాదాపు పూటుగా తాగి బైక్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి పోలీసులుకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరు సీఐ గోవిందరాజు కథనం ప్రకారం.. గుడివాడ సమీపంలోని వెంట్రప్రగడకు చెందిన […]
భారతదేశ సరిహద్దులు దాటొచ్చిని ముష్కరులకు భారత భద్రత దళాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే తాజాగా.. పుల్వామాలోని ద్రాబ్‌గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. శనివారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే. అయితే.. దీంతో ఈ సంఖ్య మూడుకు చేరింది. వారంతా లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిని ఫాజిల్ నజీర్ […]
1. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,000 2. నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. కటక్ వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 3. నేడు ఐపీఎల్ మీడియా ప్రసాద హక్కుల ఈ వేలం జరుగనుంది. ఉదయం […]
ఎంబీసీ కులాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను కాంగ్రెస్ హయాంలో కేవలం ఎస్సిలకే పరిమితం చేసిందన్నారు. అంతేకాకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను బీసీలకు కూడా కల్పించిందన్నారు. తెలంగాణలో బీసీ రుణాలు ఆటకెక్కాయి […]
విశ్వనటుడు కమల హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. దీంతో నేడు థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్, హీరో రానా, నిర్మాత సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విక్రమ్ సినిమా అన్ని సినిమాలను క్రాస్ చేసి హయ్యస్ట్ రేంజ్ లోకి వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ కెరీర్ లో పెద్ద హిట్ ఎక్కువ గ్రాసర్ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. […]
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్ బాటిల్ లభ్యం కావడంతో.. ఆమె కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే కొద్దిసేపటికి క్రితమే పోస్టుమాత్రం పూర్తి కావడంతో ఆమె తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు మృతదేహాన్ని అపోలోకు తరలించారు. అయితే.. ప్రత్యూష […]