ఇటీవల సీఎం కేసీఆర్ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మీ అధికారులు హనీ ట్రాప్ లో పడినట్లుగా.. కేసీఆర్ హాని ట్రాక్ లో ఉండవల్లి పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. మంచి పండితుడు.. ఏం చూసి కేసీఆర్ దగ్గరికి ఉండవల్లి వెళ్ళాడో తెలియదంటూ ఆయన సెటైర్లు వేశారు. […]
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో పార్ట్ టైమ్ నాన్-అఫీషియల్ డైరెక్టర్లుగా పలు పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులను ప్రభుత్వం నియమించింది. ఆర్బీఐ డైరెక్టర్గా ఆనంద్ మహీంద్రాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. అయితే ఆనంద్ మహీంద్రాతో పాటు.. రవీంద్ర ధోలాకియా, వేణు శ్రీనివాసన్, పంకజ్ పటేల్లను కూడా ఆర్బీఐ డైరెక్టర్లుగా నియమించింది కేంద్ర ప్రభుత్వం. తాజా సమాచారం ప్రకారం.. ఈ కొత్త అపాయింట్మెంట్లు నాలుగు సంవత్సరాల పాటు ఉంటాయి. కేంద్ర క్యాబినెట్ […]
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు రెండో రోజు ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 11 యేండ్ల పాటు సైలెంట్గా ఉండి… ఇప్పుడు ఏదో నోటీసులు ఇచ్చారు.. తల్లి ఆపదలో ఉంటే అండగా ఉండాలి కొడుకు.. అలాంటి […]
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు రెండో రోజు ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యంగ్ ఇండియా నాన్ ప్రాఫిట్ సంస్థ అని, సంస్థ నిర్వాహకులకు కూడా ఒక్క రూపాయి తీసుకునే హక్కు లేదని ఆయన వెల్లడించారు. […]
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి మీ ముఖం చూపియండంటూ ఆయన విమర్శలు గుప్పించారు. […]
చెల్లుబాటు అయ్యే టిక్కెట్లను కలిగి ఉన్నప్పటికీ ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించినందుకు, ఆ తర్వాత వారికి ఎలాంటి నష్టపరిహారం అందించనందుకు ఎయిర్ ఇండియాపై విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) మంగళవారం రూ.10 లక్షల జరిమానా విధించింది. “డీజీసీఏ వరుస తనిఖీలు చేసిన తర్వాత మరియు బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో మా నిఘా సమయంలో, ఎయిర్ ఇండియా విషయంలో నిర్దిష్ట సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నిబంధనలు పాటించలేదు. విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేయబడింది మరియు వ్యక్తిగత విచారణకు […]
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు రెండో రోజు ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మోడీకి భయం పుట్టినప్పుడల్లా గాంధీ కుటుంబం పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ విచారణ […]
గత నెల మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్నట్లుగా 20 రోజులలోనే పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. కానీ.. ఈ నెలాఖరు లోపు 10 వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తయ్యింది. ఇప్పుడు.. పోస్ట్ వాల్యూయేషన్ ప్రాసెస్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు.. […]
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఇటు రైతులు, అటు తెలంగాణ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతులు రుతుపవనాల కోసం ఎదురుచూస్తుంటే.. భానుడి భగ భగల నుంచి ఉపశమనం కోసం తెలంగాణ వాసులు ఎదురుచూస్తున్నారు. అయితే వీరి నిరీక్షణకు తెర దించే విధంగా సోమవారం సాయంత్రం తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తెలంగాణలోని మహబూబ్నగర్ వరకు విస్తరించిన రుతుపవనాలు మరో రెండు రోజుల్లో పూర్తిగా విస్తరిస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. […]
రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 7.04 శాతానికి తగ్గింది. ప్రధానంగా ఆహార ధరల తగ్గింపు కారణంగా ఇది వరుసగా ఐదవ నెలలో ఆర్బీఐ యొక్క ఎగువ టాలరెన్స్ స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ గణాంకాలు సోమవారం వెలువడ్డాయి. ఏప్రిల్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 7.79 శాతంగా ఉంది. మే 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.3 శాతంగా ఉంది. అయితే.. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, ఆహార […]