ఏ వస్తువైన తయారీ చేసే ఫ్యాక్టరీ నుంచి వినియోగదారుడి వద్దకు చేరుకునేందుకు మధ్య చాలా మందే ఉంటారు. అయితే.. ఈ వ్యవస్థను అధిగమించేందుకు తక్కువ ధరలో ప్రజలకు వస్తువుల అందేందుకు ఈ కామర్స్ సంస్థలు ప్రవేశించాయి. అయితే.. ఈ ఈ-కామర్స్ సంస్థలు సైతం దళారీ వ్యవస్థ మాదిరిగానే వ్యవహరిస్తున్నాయి. కానీ ఆ దళారీ వ్యవస్థను బహిర్గతం కాకుండా చూసుకునేందుకు చాలా ప్లాన్‌లే వేస్తున్నాయి. మామూలుగా వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ ప్రొడక్స్‌ను అమ్ముకునేందుకు వేదికగా ఈ-కామర్స్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రజలకు అమ్ముకునేందుకు కంపెనీ ఈ ఈ-కామర్స్ సంస్థలకు కొంత కమీషన్ల పేరిట ఇవ్వాల్సిందే. ముందుగా ఆఫర్లు అంటూ.. ప్రజలను ఆకర్షిస్తున్న ఈ-కామర్స్ సంస్థలు.. ఆ తరువాత వినియోగదారుల జేబులు చిల్లులు పడేలా చేస్తున్నాయి. నిరంతరం మొబైల్‌లో ఆ వస్తువుపై ఇంత తక్కువ, ఈ వస్తువుపై ఫ్లాట్ 50 శాతం తక్కువ అంటూ.. వివిధ నోటిఫికేషన్లు పంపిస్తూ.. వినియోగదారుల అటెన్షన్‌తో తమవైపు తిప్పుకునేలా చేస్తున్నారు. ఈ ఈ-కామర్స్ సంస్థల మధ్యే పోటీ ఎక్కువైపోయి.. ఈ ఫెస్టివల్ సేల్, ఆ ఫెస్టివల్ సేల్ అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి ఈ ఆఫర్‌లతో ప్రజలకు ఈ-కామర్స్ సంస్థలు చూస్తున్న మేలుఏమీలేదు. కంపెనీలు తమకు ఇస్తున్న కమీషన్లను తగ్గించి.. ముందుగానే వస్తువు ధరను పెంచి 80 నుంచి 90 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు భ్రమింపచేస్తున్నారు. ఒక వస్తువు ధర రూ. 10 వేలు ఉంటే.. ముందుగానే రూ.11,999 అని.. దానిపై ఫ్లాట్ 20 శాతం ఆఫర్ అని ఈ-కామర్స్ కమీషన్ మినహా రూ. 9,600లకు సేల్‌కు పెడుతున్నారు. అంతేకాకుండా.. ఏదైనా బ్రాండ్ మొబైల్స్‌పై ఆఫర్ ప్రకటించి.. వాటిని పరిమితి సంఖ్యలోనే అందుబాటులో పెడతారు.
వీరు ప్రకటించే 80 నుంచి 90 శాతం ఆఫర్లు అన్ని వస్తువలపైన ఉండవు. ఈ ఆఫర్‌ను చూసిన ఉత్సాహకులు ముందుగా ఈ-కామర్స్ సైట్‌ను సందర్శించగానే అక్కడ.. విభిన్న రకాల కేటగిరీలు, కాట్‌లాగ్‌లు దర్శనమివ్వడమే కాకుండా.. అండర్ 99, అండర్ 199 అంటూ తక్కువ ధరకే అందిస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నాయి. అండర్ 99 కేటగీరీలకు పోతే.. మన ఏరియాలో ఉండే చైనా బజార్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే.. రూ.99 కెటగీరీలో అందుకు తగ్గట్టుగానే, ఇంకా తక్కువ రకం వస్తువులే ఉంటాయి. అవి మనకు బయట మార్కెట్‌లో తీసుకున్నా అంతే ధరకు గిట్టుబాటు అవుతుందా. తీరా పోనిలే ఇంటికే వస్తుంది కదా అనుకుంటే.. చివరికి షిప్పింగ్ ఛార్జ్‌తో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఈ ఈ-కామర్స్ సంస్థలు ఇస్తున్న యాడ్స్‌ను చూసి సైట్లోకి వెళితే.. అవసరం ఉన్నవాటికంటే.. అనవసరమైనవే ఎక్కువగా కొంటున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అమెజాన్-ఫ్లిఫ్‌కార్ట్స్ సంస్థలు సైతం ఇచ్చిన ఆఫర్లూ అలాంటివే.. ఒకవేళ ఈ సైట్లలోకి వెళ్లినా.. అధిక ఆఫర్‌లు దేనిపైన ఉన్నాయో వాటిని కొనుక్కొని తిరిగి రావడం ఉత్తమం.. లేకుండా.. పండుగ బట్టలకు కొనేందుకు సైట్లోకి వెళ్లి.. ఆఖరికి డెబిట్, క్రెడిట్ కార్డు నిల్ బ్యాలన్స్‌తో బయటకు రావాల్సి ఉంటుంది.