Yash: కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారాడు కన్నడ నటుడు యష్. ఈ సినిమా కేవలం అతనిని స్టార్ ను మాత్రమే కాదు.. పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఒక్క సినిమాతో.. ఆ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న యష్.. కెజిఎఫ్ తరువాత టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఒక పెళ్ళిలో సందడి చేశారు. వీరిద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ అయిన కోనేరు కుమార్ కుమారుడు కిరణ్ కోనేరు పెళ్ళిలో ఈ ఇద్దరు స్టార్స్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరు, భార్య సురేఖతో పెళ్ళికి రాగా.. వెంకీ మామ కూతురుతో కలిసి వచ్చాడు.
Sriram: రోజా పూలు, ఒకరికొకరు సినిమాలతో తెలుగువారికి పరిచయమయ్యాడు శ్రీకాంత్ శ్రీరామ్. ఇక ఈ మధ్య పిండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది కానీ, శ్రీరామ్ కు మంచి అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం హీరోగా, సపోర్టివ్ రోల్స్ చేస్తూ బిజీగా మారాడు.
Amaran: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ మధ్యనే అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం అమరన్. ఉలగనాయగన్ కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Subhaleka Sudhakar: శుభలేఖ సుధాకర్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బక్కపలచని శరీరం, కళ్ళజోడు.. నున్నగా పక్కకు దువ్విన తల.. వెటకారంగా ఒక నవ్వు.. అప్పటి సినిమాల్లో ఇదే అతడి రూపం. శుభలేఖ సినిమాలో ఆయనను నటనకు గుర్తింపు రావడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఇక కెరీర్ మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
Varsha Bollamma: సోషల్ మీడియాలో మునిగితేలిపోయేవాళ్లు మాట్లాడుకొనే భాష వేరుగా ఉంటుంది. అదే మీమ్ భాష. ఒక సినిమాలో వచ్చే డైలాగ్ ను.. తమకు నచ్చిన విధంగా మార్చుకొని.. ఆ సిచ్యుయేషన్ కు తగ్గట్టు మాట్లాడకుండా ఈ ఒక్క మీమ్ చెప్తే చాలు. అంతే ఖతమ్.. అర్థమైనవాడు ఓకే అనుకుంటాడు. అర్ధం కానీ వాడు గురించి చెప్పాలంటే.. ఇంకాఎదగాలి భయ్యా అనేస్తారు.
Bhama Kalapam 2: హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా భామాకలాపం 2 రానుంది.
Meera Jasmine: మీరాజాస్మిన్.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన హీరోయిన్ మీరా జాస్మిన్. మలయాళం హీరోయిన్ అయినా నిండైన చీరకట్టుతో తెలుగింటి ఆడపడుచులాగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె .. భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు.. ఇలా హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
Mukesh Gowda: తెలుగు ప్రేక్షకుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక నటుడును మనసులో పెట్టుకున్నారు అంటే.. వారు జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. అది సినిమా అయినా, సీరియల్ అయినా.. ఇప్పుడు ఉన్న కాలంలో సినిమా హీరోల కన్నా, సీరియల్ హీరోస్ కే ఎక్కువ స్టార్ డమ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. సీరియల్స్ ద్వారా స్టార్స్ అయినవారు చాలామంది ఉన్నారు.
Chiranjeevi: ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ అయింది.