Mukesh Gowda: తెలుగు ప్రేక్షకుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక నటుడును మనసులో పెట్టుకున్నారు అంటే.. వారు జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. అది సినిమా అయినా, సీరియల్ అయినా.. ఇప్పుడు ఉన్న కాలంలో సినిమా హీరోల కన్నా, సీరియల్ హీరోస్ కే ఎక్కువ స్టార్ డమ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. సీరియల్స్ ద్వారా స్టార్స్ అయినవారు చాలామంది ఉన్నారు. భాష ఏదైనా.. తెలుగు ప్రేక్షకులు ఒన్ చేసుకున్నారు అంటే.. అతడిని గుండెల్లో పెట్టుకుంటారు. ఇక అలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు ముకేశ్ గౌడ. ఈ పేరు చాలామందికి తెలియదేమో.. అదే రిషి అని చెప్పండి.. టక్కున మా రిషి సర్ అంటూ చెప్పేస్తారు. సొంత పేరును కూడా మర్చిపోయేలా పాత్ర పేరు ఉంది అంటే అంతకుమించిన సక్సెస్.. అంతకు మించిన స్టార్ డమ్ మరొకటి లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగుకు పరిచయమయ్యాడు ముకేశ్. ఈ సీరియల్ ముందు నుంచి ఆసక్తిగా సాగుతూనే ఉన్నా ట్రెండ్ సెట్టర్ గా మార్చింది మాత్రం కొత్త డైరెక్టర్ కుమార్ పంతం.
ఈటీవీ లో నా పేరు మీనాక్షి లాంటి హిట్ సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన కుమార్.. ఆ తరువాత చెల్లెలి కాపురం లాంటి మరో హిట్ సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఎప్పుడైతే గుప్పెడంత మనసు సీరియల్ లోకి అడుగుపెట్టాడో అప్పటి నుంచి అతడి టేకింగ్, డైరెక్షన్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రిషిని హీరోగా ఎలివేట్ చేసే విధానం, రిషిధార ప్రేమ, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్.. ఒక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ లో చూపించాడు. నిజం చెప్పాలంటే.. అతడి టేకింగ్ వలనే రిషిధారలకు ఇంకా గుర్తింపు వచ్చిందని చెప్పాలి. అయితే సీరియల్స్ అన్నాకా.. నటీనటులకు ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి పాత్రలను మారుస్తూ ఉంటారు.దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. గత కొంతకాలంగా రిషి.. గుప్పెడంత మనసు సీరియల్ లో కనిపించడం లేదు. అయితే దానికి కారణాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ, ముకేశ్ కు ఈ సీరియల్ తరువాత సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమా కోసం సీరియల్ వద్దు అనుకున్నాడు అనేది ఒకటి అయితే.. మేకర్స్ కు, ముకేశ్ కు మధ్య కొన్ని అభిప్రాయం బేధాలు ఉన్నాయని, తనవలనే సీరియల్ హిట్ అయ్యిందని.. మేకర్స్ తో గొడవపెట్టుకొని షూటింగ్స్ సరిగ్గా రాకపోవడంతో విసిగిపోయిన మేకర్స్ ఆయనను తొలగించారని.. ఇలా ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇంత జరుగుతున్నా.. ముకేశ్ స్పందించకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది.
ఇక ఈ సీరియల్ వలనే ముకేశ్ కు మంచి పేరు వచ్చింది. సీరియల్ చేస్తున్నాడా.. ? సినిమాలు చేస్తున్నాడా.. ? అన్నది వేరే విషయం. కానీ, సీరియల్ నుంచి వెళ్ళిపోతే కనీసం తాను ఈ కారణం వలన తప్పుకున్నాను అని అభిమానులకు చెప్పడం అనేది గౌరవమని, సోషల్ మీడియా ద్వారా అయిన సీరియల్ నుంచి తాను బయటికి వచ్చినట్లు చెప్తే.. ఫ్యాన్స్ సంతోషపడేవాళ్లు కదా అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఒకపక్క సీరియల్ లో రిషి ఉన్నాడా.. ? లేడా ..? అని డైరెక్టర్ ను ఆయన ఫ్యాన్స్ పచ్చి బూతులు తిడుతున్నారు. ఇక ఎవరైనా ఎంతకాలం భరిస్తారు అన్న చందనా.. సదురు డైరెక్ట కుమార్ కూడా.. రిషి లేడు.. రిషి రాడు అంటూ తన ఆవేదనను కొద్దిగా ఆగ్రరూపంలో చెప్పడంతో.. అభిమానులు కాస్త చల్లబడ్డారు. ఇంత నేమ్, ఫేమ్ ఇచ్చిన అభిమానులకు ఇలా చేయడం తప్పు రిషి.. ఏదైనా ఉంటే ఒక్క పోస్ట్ పెడితే సరిపోతుందిగా అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఇలా ఒక సీరియల్ ద్వారా నేమ్ తెచ్చుకొని.. సినిమా అవకాశాలు వచ్చాకా.. తనను సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ను ఇలా హర్ట్ చేయడం కరెక్ట్ కాదని అభిమానులు చెప్పుకోస్తున్నారు. మరి ఇకముందైనా రిషి తన అభిమానులకు సమాధానం చెప్తాడా.. ? లేదా ..? అనేది ఎదురుచూడాలి.