Meera Jasmine: మీరాజాస్మిన్.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన హీరోయిన్ మీరా జాస్మిన్. మలయాళం హీరోయిన్ అయినా నిండైన చీరకట్టుతో తెలుగింటి ఆడపడుచులాగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె .. భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు.. ఇలా హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన మీరాజాస్మిన్ కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే అనిల్ జాన్ టైటన్స్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్ళాడి సినిమాలకు దూరమైంది. కొన్నేళ్ళకు వివాహబంధంలో విభేదాలు రావడంతో ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది.
ఇక కొన్నిరోజులుగా మీరాజాస్మిన్ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అవకాశాలు పొందడానికి అమ్మడు సోషల్ మీడియాను చాలా గట్టిగా వాడింది. అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును మత్తెక్కించింది. ఈ అందాల ఆరబోత వలన మీరాకు మంచి ఛాన్స్ లే అందాయని తెలుస్తుంది. ఇప్పటికే విమానం అనే సినిమాలో ఆమె కనిపించింది. చిన్న పాత్ర అయినా కూడా మీరాకు మంచి గుర్తింపు వచ్చింది.నేడు ఈ చిన్నదాన్ని పుట్టినరోజు. ఎట్టకేలకు పుట్టినరోజున అమ్మడు పెద్ద ఛాన్స్ పట్టిన విషయం అధికారికంగా చెప్పుకొచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఒక చిత్రంలో మీరా.. హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఒక స్పెషల్ వీడియో తో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. సినిమాలోకి ఆహ్వానించారు. ఇక అచ్చతెలుగు అమ్మాయిల మీరా చీరకట్టుతో డబ్బింగ్ చెప్తున్నట్లు కనిపించింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను చెప్పనున్నారు. ఇక దీంతో మీరా పర్ఫెక్ట్ రీఎంట్రీ పట్టేసిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా మేరకు ఎలాంటి విజయాన్ని తీసుకొస్తుందో చూడాలి.