Chiranjeevi: హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ అయింది.
వీడియో సందేశం ద్వారా చిరంజీవి మాట్లాడుతూ.. ‘ ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ చాలా బాగుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది. తనకు తాను, తన టాలెంట్‌ను తాను నమ్ముకుని హర్ష ఈ స్థాయికి వచ్చాడు. ఈ రోజు హీరో స్థాయికి ఎదిగాడు. హర్షను నమ్మి నిర్మాత సుధీర్, దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రాన్ని తీశారు. ఆసాంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని అర్థం అవుతోంది. కామెడీనే కాకుండా ఎమోషన్ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.
Also Read
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో హర్ష చెముడు మాట్లాడుతూ.. ‘మా లాంటి కొత్త వాళ్లని, చిన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. సుందరం మాస్టర్ సినిమా చాలా కొత్త పాయింట్‌తో రాబోతోంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ప్రతీ సారి ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ కథ నా దగ్గరకు వచ్చింది. నాకు నచ్చింది.. కాబట్టి చేశాను. నేను చేయగలిగిన పాత్రలే ఉంటే తప్పకుండా చేస్తాను. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే మజా వస్తుంది. అందరినీ ఆలోచింపజేసే చిత్రం అవుతుంది. కామెడీనే కాకుండా అద్భుతమైన డ్రామా కూడా ఉంటుంది. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. నేచురల్ లొకేషన్‌కు వెళ్లి షూటింగ్ చేశాం. ప్రతీ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. మా సినిమాను ఆడియెన్స్ తప్పకుండా చూసి ఆదరించాల’ని అన్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!