Bhama Kalapam 2: హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా భామాకలాపం 2 రానుంది. ఇప్పటికే భామాకలాపం 2 నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 16 న స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ పై ప్రేక్షకులు భారీ అంచనాలానే పెట్టుకున్నారు. డేంజరస్ హౌస్ వైఫ్ గా ప్రియమణి అదరగొట్టేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పాలి.
రెహమాన్ లిరిక్స్.. యాజిన్ నిజార్ అదిరిపోయింది. ర్యాప్ సాంగ్ తో పాటు అనుపమ క్యారెక్టర్ ను సాంగ్ ద్వారా చెప్పుకోచ్చారు. అనుపమ అంటేనే స్పై. ఆమెకు వంట చేయడం ఎంత ఇష్టమో.. అంతకు మించి చుట్టుపక్కల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇంకా ఇష్టం. ఇక వయ్యారి గూఢచారి.. ప్రతిదాంట్లో దూరిదూరి.. చేస్తోంది హోరాహోరీ అంటూ రైమింగ్ లో వచ్చే లైన్స్ అయితే భలే ఉన్నాయి. ఇక అనుపమ.. కిల్లర్ గా మారడం.. దాన్ని కప్పిపుచ్చడానికి చేసిన రచ్చ అంతా సాంగ్ లో ఎంతో చక్కగా చెప్పారు. ఇక షీ ఈజ్ డేంజరస్ హౌస్ వైఫ్ అనే లైన్ అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. ఒక సిరీస్ కు ఈ రేంజ్ థీమ్ సాంగ్ .. సూపర్. మరి ఈ సిరీస్ ప్రియమణికి ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.