Andhra Pradesh: కొవిడ్-19 బూస్టర్ డోస్ టీకా విషయంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఏపీలో ఇప్పటికే సుమారు 59 లక్షల మంది ఈ మూడో డోస్ వేయించుకున్నారు. దేశం మొత్తమ్మీద ఏ రాష్ట్రంలోనూ లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ మంది బూస్టర్ డోస్ తీసుకోలేదు.
MIM Party: జాతీయ రాజకీయ పార్టీ రేంజ్లో దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆశిస్తున్న హైదరాబాద్ లోకల్ పొలిటికల్ పార్టీ ఎంఐఎం.. మధ్యప్రదేశ్‌లో తన ప్రయాణాన్ని మస్తుగా షురూ జేసింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. బీజేపీ పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో ఎంఐఎం లేటెస్టుగా లోకల్ బాడీ ఎలక్షన్లో అకౌంట్ ఓపెన్ చేసింది. జబల్పూర్, బుర్హాన్పూర్, ఖంద్వా పట్టణాల్లో నాలుగు వార్డులను కైవసం చేసుకుంది. జబల్పూర్ మునిసిపాలిటీలో ఇద్దరు, మిగతా రెండు చోట్ల ఒక్కరు చొప్పున […]
Business Flash 19-07-22: బెంగళూరుకు చెందిన సెల్ 'ఆర్ అండ్ డీ' ఫెసిలిటీలో ఓలా ఎలక్ట్రిక్ 4000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఇక్కడ అత్యంత అధునాతన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు.
Business Headlines 19-07-22: ఫారన్ ఫండ్ మేనేజర్లకు మన ప్రభుత్వ రంగ సంస్థలపై నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటికే ఇండియన్ ఈక్విటీల్లోని 2 లక్షల 27 వేల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు.
Inspirational News: సహజంగా తండ్రిని కొడుకు ఆదర్శంగా తీసుకుంటాడు. కానీ ఈ కథ వేరు. తండ్రే కొడుకు బాటలో నడిచాడు. డాక్టర్ అవ్వాలనే జీవితాశయాన్ని నెరవేర్చుకునేందుకు ఏకంగా 55 ఏళ్ల వయసులో 'నీట్'కి హాజరయ్యాడు. అతని పేరు కె.రాజ్యక్కొడి. తమిళనాడులోని మదురై వాసి. రైతు.
Bhoodan Movement: తన వంద ఎకరాల భూమిని పేదల కోసం దానమిచ్చి భూదానోద్యమానికి ఆద్యుడిగా నిలిచిన వెదిరె రామచంద్రారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ పోస్టల్ విభాగం ఆయన పేరు, ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ కవర్ని ఆవిష్కరించింది.
Har ghar Tiranga: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయటానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 20 కోట్ల ఇళ్ల పైన మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగరేయటానికి ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే (ఆగస్టు) నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల […]
Business Updates: ఈ వారం స్టాక్ మార్కెట్ల శుభారంభమయ్యాయి. సెన్సెక్స్ 450 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16,200 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో ఐటీ, మెటల్ షేర్ల కొనుగోళ్లు 1 నుంచి 3 శాతం పెరిగాయి. ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ స్టాక్స్‌కి కూడా ప్రాఫిట్స్ వచ్చాయి.
Business Headlines: పెరిగిన జీఎస్టీ రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. లేబుల్ వేసిన ఫుడ్ ఐటమ్స్‌తోపాటు రూమ్ రెంట్ ఐదు వేల రూపాయలకు పైగా ఉన్న ఆస్పత్రుల బిల్లులపై అదనంగా ఐదు శాతం జీఎస్టీని ఇవాళ్టి నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
Aam Aadmi Party: ఇప్పటికే జాతీయ రాజధాని ఢిల్లీలో అధికారంలో పాతుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రీసెంట్గా పంజాబ్‌లోనూ పవర్లోకి వచ్చింది. లేటెస్టుగా మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ మునిసిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవటం ద్వారా ఆ రాష్ట్రంలో అకౌంట్ తెరిచింది.