తీవ్ర ఒత్తిళ్లలో బంగారం మార్కెట్ అమెరికా ద్రవ్యోల్బణం భారీగా ఎగబాకటంతో ఇన్వెస్టర్లు బంగారంపై భరోసాతో పెట్టుబడి పెట్టలేని పరిస్థితి నెలకొంది. గోల్డ్ రేటు కనీసం 100 బేసిస్ పాయింట్లయినా పెరుగుతుందనుకుంటే మార్కెట్ అనూహ్యంగా సుమారు 40 డాలర్లు నష్టపోయింది. పసిడి ధరలు నిన్న తిరిగి కోలుకునే తరుణంలో సైకలాజికల్ లెవల్ 1700 డాలర్ల తగ్గటం గమనార్హం. ఏరో సిటీలపై అదానీ గ్రూప్ ఫోకస్ ఏరో సిటీల అభివృద్ధిపై అదానీ గ్రూప్ దృష్టి పెట్టింది. తన గ్రూపు అధీనంలో […]
ఎయిర్‌టెల్‌లో 1.2 శాతం వాటా గూగుల్‌కి. ముందుగా ప్రకటించినట్లుగానే ప్రముఖ సెర్చింజన్ గూగుల్ భారతీఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్‌లో 1.2 శాతం వాటాను దక్కించుకుంది. ఒక్కో షేరుకు 734 రూపాయల చొప్పున 71 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ మేరకు గూగుల్ 700 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు భారతీఎయిర్‌టెల్ సెబీకి తెలిపింది. ఆర్బీఐ క్రెడిట్, డిపాజిట్ల వెల్లడి క్రెడిట్ మరియు డిపాజిట్ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. క్రెడిట్ 13.29 శాతం పెరగటంతో […]
వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే వారం రోజుల నుంచి కంటిన్యూగా కురుస్తున్నాయి. గత పాతికేళ్లలో వరుసగా ఇన్ని రోజులు ముసురు పట్టడం ఇదే తొలిసారి కావొచ్చు. దీంతో పొద్దు పొడవక, సూర్యుణ్ని చూడక ఎన్ని రోజులైందో అన్నట్లుంది. ‘సన్’డే ఎప్పుడొస్తుందా అని జనం ఎదురుచూస్తున్నారు. సెలవు కోసం కాదు. వాన ఇంకెప్పుడు సెలవు తీసుకుంటుందా అని. వాతావరణం విపరీతంగా చల్లబడటంతో బయటికి రాలేక, ఇంట్లో ఉన్నా తలుపులూ కిటికీలూ తెరుచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా […]
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మొక్కలు నాటారు. జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని జీహెచ్ఎంసీ పార్క్‌లో నిర్వహించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో తన బృందంతో కలిసి పాల్గొన్నారు. సింగర్లు అరుణ్ కౌండిన్య, అమల, మోహన, హైమత్ మహమ్మద్, గోమతి, రాహుల్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ‘మౌనంగానే ఎదగమని.. మొక్క నీకు చెబుతుంది’ అనే పాట పాడారు. తద్వారా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ని సంగీతమయం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ మనిషికి మొదటి గురువు […]
మన దేశంలో ‘బాష్’ భారీ పెట్టుబడి ఆటోమొబైల్ విడి భాగాల తయారీలో పేరున్న, పెద్ద సంస్థ బాష్ లిమిటెడ్ మన దేశంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.200 కోట్లకు పైగానే (25.12 మిలియన్ డాలర్లు) ఖర్చుచేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి. తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం (10 శాతం) తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది. బీహార్‌లో అతి తక్కువ (4.7 […]
జూన్‌లో అమెరికా ద్రవ్యోల్బణం 9.1 శాతం అమెరికాలో వినియోగదారుల ధర సూచీ (సీపీఐ) ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరిగింది. జూన్ నెలలో తొమ్మిదీ పాయింట్ ఒక శాతానికి శరవేగంగా ఎగబాకింది. ఆహార, చమురు ధరలు కలపకుండానే ఈ ఫలితాలను నమోదుచేసింది. ఇది నాలుగు దశాబ్దాల గరిష్టం కావటం చెప్పుకోదగ్గ విషయం. 1981 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో దూసుకుపోవటం ఇదే తొలిసారి. యూఎస్‌లో గతేడాది జూన్‌లో ద్రవ్యోల్బణం 5.9 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ఈ అంచనా […]
ఇండియాలో అందరూ ప్రేమించే ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్ అని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) అజయ్‌సింగ్ చెప్పుకున్నారు. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టరే (పీఎల్ఎఫ్) దీనికి నిదర్శనమని చెప్పారు. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 80 శాతానికి పైనే సీట్లు నిండాయని వెల్లడించారు. తమపై నమ్మకం ఉంచినందుకు ప్రయాణికులకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న బుధవారం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఫుల్ పేజీ యాడ్ కూడా ఇచ్చారు. అందులో […]
రాష్ట్రపతిగా రామ్నాథ్కోవింద్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై ఆసక్తి నెలకొంది. గత ఐదేళ్లలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 200కు పైగా కేంద్ర ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో అవన్నీ చట్టాలుగా మారాయి. అయితే వాటిలో చాలా వరకు ఇంకా అమల్లోకి రాకపోవటం గమనార్హం. ఆయా చట్టాల అమలుకు కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించకపోవటమే దీనికి కారణం. మరోవైపు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఐదేళ్ల కాలంలో ఆరు క్షమాభిక్ష […]
ఈ ఏడాది రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసా (ఎఫ్1) అప్లకేషన్లు అందనున్నాయని అమెరికా కాన్సులేట్ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం జనవరి నుంచి మే 14 నాటికే 14,694 స్టూడెంట్ వీసాలను జారీ చేసినట్లు వెల్లడించాయి. ఈ సంఖ్య కరోనా ముందు నాటి పరిస్థితులతో పోల్చితే దాదాపు ట్రిపుల్ కావటం విశేషం. 2019లో తొలి ఐదు నెలల్లో 5,663 వీసాల దరఖాస్తులే ఆమోదం పొందాయి. ఈ ఇయర్లో ఇంకా ఏడు నెలల సమయం […]
ఇవాళ గురుపూర్ణిమ. ఈ రోజు గురువుల ఆశీర్వాదం పొందితే పుణ్యమని ప్రగాఢ నమ్మకం. ఏటా ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ఈ పండుగ చేసుకుంటారు. మనిషిని సక్రమ మార్గంలో పెట్టి ముక్తి వైపు నడిపించే వ్యక్తులను గురువులుగా భావిస్తారు. తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్లందరి ప్రభావం మన జీవితం మీద ఉంటుంది. అందుకే విద్యార్థులు గురువులతోపాటు తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో పాదపూజ చేసి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకుంటారు. గురువులకే […]