Business Updates: స్టాక్ మార్కెట్ల బిజినెస్ అప్‌డేట్లు.. కంపెనీల త్రైమాసిక ఫలితాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Updates: స్టాక్ మార్కెట్
ఈ వారం స్టాక్ మార్కెట్ల శుభారంభమయ్యాయి. సెన్సెక్స్ 450 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16,200 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో ఐటీ, మెటల్ షేర్ల కొనుగోళ్లు 1 నుంచి 3 శాతం పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ స్టాక్స్‌కి కూడా ప్రాఫిట్స్ వచ్చాయి. బీఈఎల్ భారీ లాభాలు ప్రకటించటంతో ఆ కంపెనీ షేర్లు నాలుగు శాతం పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. టీసీఎస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ తదితర సంస్థలు ఎక్కువగా లాభపడ్డాయి.
Also Read
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
త్రైమాసిక ఫలితాలు
లోకల్ సెర్చ్ ఫ్లాట్‌ఫాం ‘జస్ట్ డయల్’ ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఫస్ట్ క్వార్టర్‌తో పోల్చితే ఈసారి మొత్తం నష్టం రూ.48.36 కోట్లకి పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు.. టాటా ఎల్‌ఎక్స్‌సి మొదటి మూడు నెలల్లో నికర లాభం 63 శాతం పెరిగినట్లు తెలిపింది. ఈ సంస్థకు గతేడాది ఇదే సమయంలో రూ.113.8 కోట్లు మాత్రమే రాగా ఈసారి రూ.184.72 కోట్ల వరకు లాభాలను ఆర్జించింది.
సౌదీకి రష్యా నుంచి రెట్టింపు చమురు
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా రష్యా నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకుంది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండో త్రైమాసికంలో రెట్టింపు కన్నా ఎక్కువే ఇంపోర్ట్ చేసుకోవటం గమనార్హం. దీంతో సౌదీ అరేబియా తన సొంత చమురును ఇక పూర్తిగా ఎగుమతులకే కేటాయించనుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవటంపై పలు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో రష్యా.. రేటు తగ్గించి మరీ సౌదీ అరేబియాకి చమురును ఎగుమతి చేస్తోంది. రాయిటర్స్ వెల్లడించిన డేటా ప్రకారం సౌదీ అరేబియా రష్యా నుంచి 6 లక్షల 47 వేల బ్యారెళ్ల చమురును ఇంపోర్ట్ చేసుకుంది. అంటే సౌదీ అరేబియా రష్యా దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి విదేశాలకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటోందన్నమాట.
more read: Business Headlines: బంగారం ధరలు మరింత పతనం.. పెరిగిన రైతుల ఆదాయం..
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!