CM KCR: మొన్న బీహార్ వెళ్లొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా పశ్చిమ బెంగాల్ వెళ్లనున్నారని సమాచారం. అనంతరం.. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను సందర్శిస్తారని వార్తలొస్తున్నాయి. 'బీజేపీ ముక్త్ భారత్' నినాదంతో విపక్షాలను ఏకం చేసేందుకు, 2024 జనరల్ ఎలక్షన్లో అధికార పార్టీ కమలానికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
India's Good News to World: ప్రపంచంలోనే ఎక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తున్న మన దేశం వచ్చే సీజన్ నుంచి అంటే ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెండు విడతల్లో విదేశాలకు ఎగుమతులు చేయనుంది. ఇటు రైతులు.. అటు వినియోగదారులు.. ఇద్దరి ప్రయోజనాలనూ బ్యాలెన్స్ చేస్తూ ఎవరికీ చేదు అనుభవం ఎదురుకాకుండా ముందుచూపుతో వ్యవహరించనుంది. షుగర్ ఎక్స్‌పోర్ట్‌లపై ప్రస్తుత సీజన్లో కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై తగ్గి ధరలు పెరిగాయి.
AP High Court: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. కానీ ఈ చట్టం పెద్దగా అమలైనట్లు కనిపించట్లేదు. ఇదే విషయాన్ని ఓ న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సీరియస్ అయింది. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయలోదో వివరణ ఇవ్వాలని కోరింది.
Survey on Romance: నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)-5లో తాజాగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 2019-21 మధ్య కాలంలో నిర్వహించిన ఎన్ఎఫ్హెచ్ఎస్-5లో భాగంగా మన దేశంలో తొలిసారిగా శృంగారంపై సర్వే చేశారు. రొమాన్స్‌లో కండోమ్ వాడకంపైనా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. వయసులో ఉన్న వంద మంది మహిళల్లో కేవలం 2 శాతం మందే గతేడాది రొమాన్స్‌లో పాల్గొన్నారు.
Disney Follows Amazon Prime: అమేజాన్ ప్రైమ్ మాదిరిగానే డిస్నీ కస్టమర్లకి కూడా త్వరలో డిస్నీ ప్రైమ్ అందుబాటులోకి రానున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సబ్స్క్రిప్షన్ సర్వీసులను ప్రారంభించేందుకు ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. డిస్నీ ప్లస్ అనే స్ట్రీమింగ్ సర్వీస్‌తోపాటు డిస్నీ ప్రైమ్ కూడా ఆరంభమైతే బ్రాండెడ్ మర్చెండైజ్లు, థీమ్ పార్క్‌లు, ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు ప్రకటించనుంది. అమేజాన్ ప్రైమ్‌ని స్ఫూర్తిగా తీసుకొని డిస్నీ ఎగ్జ్క్యూటివ్లు ఈ కొత్త ప్రణాళికను రచించారు.
First Virtual School in India: దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ స్కూల్‌ని నిన్న బుధవారం ప్రారంభించామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఈ స్టేట్మెంట్ తప్పు అంటూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) ఖండించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పినదాని ప్రకారం.. ఈ స్కూల్లో దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా స్టూడెంట్స్ అడ్మిషన్ పొందొచ్చు.
Education, Jobs Information: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ శాఖల్లో 2,910 ఉద్యోగాల నియామకానికి అనుమతించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 52,460 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గ్రూప్-3 జాబులు 1373, గ్రూప్-2 కొలువులు 663, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 347, పశుసంవర్థక శాఖలో 294, కోపరేటివ్ డిపార్ట్మెంట్లో 99, వేర్‌హౌజింగ్ సంస్థలో 50, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25, హార్టికల్చర్‌లో 21
Increase Credit: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించింది. క్రెడిట్ గ్రోత్‌ను మరింత పెంచాలని, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ల స్థితిగతుల పైన కూడా ఫోకస్ పెట్టాలని ఆదేశించింది. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్యకలాపాలను ప్రారంభించటంపై ఆసక్తితో ఉన్నామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.
Special Story on Vinayaka: చదువుకోవాలనే మనసు, అమితాసక్తి ఉండాలే గానీ ప్రతి వ్యక్తి జీవితమూ ఒక విలువైన పుస్తకమే. పుస్తకాన్ని పఠించి మస్తకాన్ని మథిస్తే విజ్ఞానం పుడుతుంది. విఘ్నేశ్వరుడి పుట్టుక, లీలల విశేషాలు దీనికో చక్కని ఉదాహరణ. ఎందుకంటే ఈ గణపతి.. సకల కళలకు, శాస్త్రాలకు అధిపతి. ఈ దేవదేవుడు.. బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడు. అందుకే ఈ పార్వతీ పుత్రుడికి ప్రతి క్రతువులో ప్రథమ పూజ చేస్తారు.
NPAs may Increase: ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈ రంగంలో ఎన్పీఏలు పెరిగే అవకాశం ఉందని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ అండ్ ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎంఎస్ఎంఈలతోపాటు ఏవియేషన్, టూరిజం, హాస్పిటాలిటీ, పవర్, రిటైల్ ట్రేడ్ వంటి రంగాలకు కూడా ఈ ప్రమాదం ఎదురుకానుందని స్టడీలో పాల్గొన్న బ్యాంకులు పేర్కొన్నాయి.