Education, Jobs Information: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ శాఖల్లో 2,910 ఉద్యోగాల నియామకానికి అనుమతించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 52,460 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గ్రూప్-3 జాబులు 1373, గ్రూప్-2 కొలువులు 663, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో 347, పశుసంవర్థక శాఖలో 294, కోపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో 99, వేర్‌హౌజింగ్ సంస్థలో 50, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25, హార్టికల్చర్‌లో 21, ఫిషరీస్‌లో 15, మార్కెటింగ్‌లో 12, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో 11 పోస్టుల నియామకానికి గవర్నమెంట్ తాజాగా పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1654 గెస్ట్ లెక్చరర్‌ల రిక్రూట్మెంట్‌కి సైతం ఓకే చెప్పింది.
అందరికీ ఆ మార్కులు
ఆదివారం జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ విడుదలైంది. టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆన్‌లైన్‌లో మాత్రమే సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని పోలీస్ ఉద్యోగాల నియామక మండలి చైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ రెండు మార్కులు, ఎస్సై ఎగ్జామ్ అటెంప్ట్ చేసినవారికి 8 మార్కులు కలపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Increase Credit: క్రెడిట్ పెంచుకోండి. ఎన్‌పీఏల పైనా ఫోకస్ పెట్టండి.
ట్యాలెంట్ అవార్డులు
తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరుకాపు విద్యార్థులకు ఎంకేవీవీజీ ట్రస్టు ట్యాలెంట్ అవార్డులను ఇవ్వనుంది. టెన్త్, ఇంటర్‌లో 90 శాతానికిపైగా మార్కులు పొందిన స్టూడెంట్స్ www.mkvvgtrust.org అనే వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. వచ్చే నెల (సెప్టెంబర్) 30వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలి. మరిన్ని వివరాలు కావాలంటే 040-24658160, 040-24657404 నంబర్‌లకు కాల్ చేసి మాట్లాడొచ్చు. ఈ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కాచిగూడలో మున్నూరుకాపు విద్యార్థుల హాస్టల్ ఉన్న సంగతి తెలిసిందే.
ఓపెన్ స్కూల్ ప్రాక్టికల్స్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్‌ఐఓఎస్ రీజనల్ డైరెక్టర్ వెల్లడించారు. టైమ్ టేబుల్ కోసం ఎన్‌ఐఓఎస్ వెబ్‌సైట్‌లో చూడొచ్చని పేర్కొన్నారు. 040-24752859, 040-24750712 నంబర్‌లకు కాల్ చేయొచ్చని తెలిపారు.
అమెరికా ఎడ్యుకేషన్ ఫెయిర్
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ‘ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ’ అనే సంస్థ ఆన్‌లైన్ ఫెయిర్ నిర్వహిస్తోంది. పీజీ కోర్సుల్లో చేరాలనుకునేవారు సెప్టెంబర్ 3వ తేదీన, డిగ్రీ కోర్సులకు 10వ తేదీన ఈ సెమినార్‌కి హాజరుకావాలని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ సూచించింది. ఈ రెండు రోజులూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు (మూడు గంటల సేపు) ఈ వర్చువల్ ఫెయిర్‌లో పాల్గొనొచ్చు. ఈ మేరకు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. https://bit.ly/EdUSAFair22EmbWeb అనే లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వొచ్చు.
ఇంటర్ సప్లిమెంటరీ పాసయ్యారా?..
నిన్న ప్రకటించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలో పాసైన విద్యార్థులకు ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు అవకాశం కల్పించేందుకు స్లాట్ బుకింగ్ చివరి తేదీని పొడిగించారు. రేపటి (సెప్టెంబర్ 1) లోపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. వాస్తవానికి ఈ డెడ్‌లైన్ మొన్న సోమవారంతోనే ముగిసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 2వ తేదీ లోపు, వెబ్ ఆప్షన్స్ కోసం 3వ తేదీ లోపు గడువు నిర్దేశించారు.
అడ్మిషన్ల గడువు పెంపు
ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. గతంలో.. సెప్టెంబర్ 1 లోపే చేరాలంటూ చివరి తేదీని నిర్ణయించగా దాన్ని ఇప్పుడు సెప్టెంబర్ 15 వరకు పెంచారు.