NTV Business ICONS Exclusive Interview: 'కలారి క్యాపిటల్' ఫౌండర్ వాణి కోలా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. మన దేశ వ్యాపార రంగంలో వాణి కోలా అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరు. వెంచర్ క్యాపిటలిజానికి మార్గదర్శకురాలిగా పేరొందారు.
Mukesh Ambani statement on Jio 5G: హైస్పీడ్ 5జీ స్పెక్ట్రం సర్వీసులను ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి తేనున్నట్లు రిలయెన్స్ జియో సంస్థ ప్రకటించింది. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయెన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆన్లైన్లో జరిగిన సంస్థ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆయన కంపెనీ షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
First Water School in Hyderabad: జలక్రీడలకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి వాటర్ స్కూల్‌ని హైదరాబాద్‌లో నిన్న ప్రారంభించింది. ఈ ఎక్స్‌క్లూజివ్ స్కూల్‌ని మాదాపూర్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మునిసిపల్ వ్యవహారాలు-పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆరంభించారు. సెయిలింగ్, కయాకింగ్, విండ్ సర్ఫింగ్, స్టాండప్ ప్యాడ్లింగ్తోపాటు ఇతర జల అనుబంధ క్రీడలను ఇక్కడ నేర్పిస్తారు.
Top Five Software Companies in the World: మనకు పలు సాఫ్ట్వేర్ కంపెనీల పేర్లు, వాటి అధిపతుల గురించి తెలిసి ఉండొచ్చు. కానీ.. ప్రపంచంలోని టాప్ ఫైవ్ సాఫ్ట్వేర్ సంస్థలేవి అంటే మాత్రం సరిగ్గా ఆన్సర్ చెప్పలేం. ఈ ప్రశ్నకు ఠక్కున సమాధానం కావాలంటే ఎన్-బిజినెస్ అందిస్తున్న ఈ చిన్న వీడియో చూస్తే సరిపోతుంది. ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న ఐదు సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి సీఈఓల పేర్లు, ప్రధాన కార్యాలయం ఉన్న ప్ర'దేశం', రెవెన్యూ, మార్కెట్ క్యాపిటల్, ఉద్యోగుల సంఖ్య వంటి…
Stock Market Analysis: సోమవారం నుంచి నిన్న శుక్రవారం వరకు ఇండియన్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కనబరిచిన పనితీరును 'వెల్త్ ట్రీ గ్రూప్' ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి చక్కగా విశ్లేషించారు. వివిధ కంపెనీల షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలను, స్టాక్ విలువల హెచ్చుతగ్గులపై అమెరికా వడ్డీ రేట్ల ప్రభావాన్ని వివరించారు. ఏయే సంస్థల స్టాక్స్ బాగా రాణించాయో చెప్పారు.
Startups Achieved Unicorn Status: ఇండియన్ యూనికార్న్ క్లబ్లో ఈ ఏడాది కొత్తగా 20 స్టార్టప్‌లు చేరాయి. దీంతో ఇండియన్ యూనికార్న్‌ల మొత్తం సంఖ్య 106కి పెరిగింది. వీటన్నింటి అంచనా విలువ 343 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో 94 బిలియన్ డాలర్ల ఫండింగ్‌ని ఈ స్టార్టప్‌లు బయటి సంస్థల నుంచి రైజ్ చేయటం విశేషం.
Special Story on Jio Super Success Journey: ప్రస్తుతం మన దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయెన్స్ జియో అనే సంగతి అందరికీ తెలిసిందే. జియో పూర్తి పేరు 'జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆపర్చునిటీ'. ఈ కంపెనీ 2016లో ప్రారంభమైంది. లాంఛ్ అయిన రెండేళ్లలోనే అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌గా ఎదిగింది. రిలయెన్స్ జియోని ప్రారంభించాలనే ముఖేష్ అంబానీ ఆలోచనకు మూలకారణం ఆయన కూతురు ఇషా అంబానీ. కాలేజీ అసైన్మెంట్ సబ్మిట్ చేసే సమయంలో డేటా స్లోగా ఉండటం వల్ల
NTV Business Exclusive Interview Promo With Vani Kola. Watch Full Interview On 29th August: వాణీ కోలా. కలారి క్యాపిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఫార్చ్యూన్ ఇండియా నిర్వహించిన సర్వేలో మన దేశ వ్యాపార రంగంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. ఇండియన్
Doli Updated Version: ఏజెన్సీ ఏరియాల్లో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో రోగాల బారినపడ్డవారిని, పురిటి నొప్పులతో బాధపడే గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలంటే డోలీ మాత్రమే ఏకైక రవాణా సాధనం. సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్ల స్థానికులు వీటిలోనే పేషెంట్లను భుజాలపై మోసుకుంటూ వెళతారు.