Business Headlines 10-03-23: వి-హబ్ ‘సార్తిక’ లాంఛ్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వి-హబ్.. అంటే.. విమెన్స్ హబ్.. సార్తిక అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలుచేస్తున్న వివిధ పథకాలపై వారికి అవగాహన కల్పించటమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. కేంద్రం ప్రవేశపెట్టిన.. ప్రధానమంత్రి ఉపాధి అవకాశాల కల్పన పథకం, ముడిపదార్థాల సరఫరా పథకం, బార్కోడ్ రిజిస్ట్రేషన్ సబ్సిడీ పథకం వంటివాటిపై తొలుత మహిళా పారిశ్రామికవేత్తల్లో చైతన్యం కల్పించనున్నారు.
Stock Market Roundup 09-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం బాగా బలహీనపడింది. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా పెంచనుందనే భయాలు ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌ని వెంటాడాయి. దీంతో.. ఉదయం నుంచే రెండు కీలక సూచీలు నష్టాల బాట పట్టాయి. సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. బెంచ్ మార్క్‌కి దిగువన ఎండ్ అయ్యాయి. సెన్సెక్స్ 541 పాయింట్లు కోల్పోయి 59 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 164 పాయింట్లు తగ్గి 17 వేల 589 పాయింట్ల…
India’s top 10 richest women: ఈ రోజుల్లో మహిళలు రాణించని రంగమంటూ లేదు. అన్ని సెక్టార్లలోనూ వాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఒక వైపు కుటుంబాన్ని.. మరో వైపు కంపెనీలను విజయవంతంగా నడుపుతున్నారు. తద్వారా.. సంపదలో సైతం ముందుంటూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలోని టాప్-10 సంపన్న మహిళల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
Tata Motors: టాటా మోటార్స్ సంస్థ మరోసారి నిధుల సమీకరణ ప్రయత్నాలను మొదలుపెట్టింది. విద్యుత్ వాహనాల విభాగంలో వాటాల కేటాయింపు ద్వారా ఫండ్‌రైజ్ చేయనుంది. ఈ మేరకు వెల్త్ ఫండ్స్ మరియు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది. రెండేళ్ల కిందట బిలియన్ డాలర్లను సమీకరించిన ఈ కంపెనీ ఇప్పుడు కూడా బిలియన్ డాలర్లను సేకరించనుంది. ఈ నిధుల్లో ఎక్కువ శాతాన్ని అప్పులు తీర్చేందుకు వాడుకోనుంది. గతంలో ఈవీ మార్కెట్ వ్యాల్యూని 9 పాయింట్ 1 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
Business Headlines 09-03-23: తగ్గిన వెండి.. పెరిగిన స్టీల్..: వెండి ధర భారీగా తగ్గింది. 2 వేల 285 రూపాయలు దిగొచ్చింది. దీంతో కేజీ వెండి రేటు గరిష్టంగా 62 వేల 25 రూపాయలు పలికింది. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గటమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం రేటు కూడా 615 రూపాయలు డౌన్ అయింది. 10 గ్రాముల గోల్డ్ అత్యధికంగా 55 వేల 95 రూపాయల వద్ద ఉంది. మరో వైపు.. స్టీల్ రేట్ ఒక్కసారే 2 వేల రూపాయలు పెరిగింది.
Stock Market Roundup 08-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో నష్టాల నుంచి కోలుకుంది. రెండు కీలక సూచీలకు లాభాలతో శుభం కార్డు పడటం వరుసగా ఇది మూడో రోజు. మార్నింగ్ ట్రేడింగ్‌లో 60 వేల కన్నా దిగువకు వచ్చిన సెన్సెక్స్ ఎట్టకేలకు బెంచ్ మార్క్‌ను దాటింది. చివరికి.. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 60 వేల 348 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
Business Headlines 08-03-23: గౌతమ్ అదానీకి నిఫ్టీ షాక్: అదానీ గ్రూపు కంపెనీలకు స్టాక్ మార్కెట్ షాకిచ్చింది. నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ నుంచి 4 సంస్థల షేర్లను NSE తీసేసింది. ఈ నిర్ణయం 31వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆల్ఫా 50 ఇండెక్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్, టోటల్ గ్యాస్ డిలీటయ్యాయి. 100 ఆల్ఫా 30 నుంచి అదానీ పోర్ట్స్ & ఎస్ఈజెడ్ని తొలగించారు. 200 ఆల్ఫా 30 నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తీసేశారు.
Air India: ఎయిరిండియా.. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా శరవేగంతో విస్తరించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఆ విమానాల్లో పనిచేసేందుకు కొత్తవాళ్లను నియమించుకోనుంది. ఈ ఏడాది 4 వేల 200 మందికి పైగా క్యాబిన్ సిబ్బందిని మరియు 9 వందల మంది పైలట్లను అదనంగా తీసుకోనుంది. ఏడాది కిందట టాటా గ్రూప్ సొంతమైన ఎయిరిండియా 470 విమానాలను తెప్పించుకునేందుకు బోయింగ్ మరియు ఎయిర్‌బస్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Business Headlines 07-03-23: పేటీఏం-ఏపీ ఒప్పందం: పేటీఎం సంస్థకు మరియు ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, ఆరోగ్యం మరియు సైబర్ భద్రత వంటి రంగాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రజల నుంచి మరియు వ్యాపార సంస్థల నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తాయి. టోల్ ప్లాజాలు సైతం ఈ ఆన్లైన్ పేమెంట్లను తీసుకుంటాయి.
Success Journey of Augustus: రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి అతికొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంపెనీ.. శ్రేయ. ఈ స్థిరాస్తి సంస్థ.. సామాన్యుల సొంతింటి కలలను సాకారం చేసే సరైన వేదికగా నిలుస్తోంది. అంతేకాదు.. వేల మందికి ఉపాధి చూపుతోంది. ఈ కంపెనీని ఇంత సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న వ్యక్తి అగస్టస్. శ్రేయ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్.