Stock Market Roundup 06-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి ఈవారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం కూడా లాభాలతోనే ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు వెలువడటంతో ఒక్కో ఇండెక్స్ సున్నా పాయింట్ ఏడు శాతం వరకు పెరిగాయి. ఈ రోజు సెన్సెక్స్ మళ్లీ 60 వేల బెంచ్ మార్క్‌ను దాటడం చెప్పుకోదగ్గ విషయం. చివరికి.. సెన్సెక్స్.. 415 పాయింట్లు పెరిగి 60 వేల 224 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. 117…
Farmers Income: ఈ సంవత్సరం రైతుల ఆర్థిక పరిస్థితి బాగుంటుందని ఒక అధ్యయన సంస్థ శుభవార్త చెప్పింది. రబీ సీజన్లో ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదవుతుందని అంచనా వేసింది. ఓపెన్ మార్కెట్లో పంటల రేట్లు కూడా భారీగానే పెరగనున్నాయని.. ఫలితంగా.. కర్షకులకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొంది. ఎరువుల రేట్లు సైతం దిగొస్తాయని, తద్వారా అన్నదాతలకు అన్నివిధాలుగా కలిసొస్తుందని వివరించింది.
Financial Advises: కేవలం శాలరీతోనే ఎవరూ సంపన్నులైపోరు. ఆర్థికంగా పైకి రావాలంటే ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఇండియాలోనే ‘ది బెస్ట్’, యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదీ అంటే మ్యూచువల్ ఫండ్ అని చెప్పొచ్చు. ఇందులో ముందుగా ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టారనుకుందాం. ఆ అమౌంట్‌ని ఒక ప్రొఫెషనల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.
Business Headlines 06-03-23: తలసరి ఆదాయం లక్షా 72,000: భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద లక్షా 72 వేల రూపాయలుగా నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం..NSO తెలిపింది. గడచిన 8 ఏళ్లలో ఇది సుమారు 99 శాతం పెరగటం చెప్పుకోదగ్గ విషయం. అయితే.. ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద ఇంతగా ఉండేది కాదని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ అన్నారు. తలసరి ఆదాయంలో పెరుగుదల వల్ల పేదలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ISID డైరెక్టర్…
Stock Market Roundup 03-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని లాభాలతో ముగించింది. ఇవాళ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం భారీ లాభాలతో ఎండ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి అనుకూల సంకేతాలు వెలువడటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ని బలపరిచింది. లార్జ్ క్యాప్స్ అయిన ఎస్బీఐ, రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మరియు భారతీ ఎయిర్టెల్ విశేషంగా రాణించాయి.
IT Minister KTR Highlight Speech: ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మనందరికీ తెలుసు. కానీ.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. దీనికి కొత్త అర్థం చెప్పారు. ఐ అంటే ఇండియా అని, టీ అంటే తైవాన్ అని పేర్కొనటం ద్వారా అందర్నీ ఆకట్టుకున్నారు. నిన్న గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘టీ-వర్క్స్’ ప్రారంభోత్సవంలో ఆయన ఈ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. తైవాన్ కేంద్రంగా పనిచేసే ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం పట్ల మంత్రి కేటీఆర్…
Increments in India: లేచింది మొదలు.. పడుకునే వరకు.. లేఆఫ్ వార్తలతో నీరసించిపోతున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఒక శుభవార్త. ఈ ఏడాది శాలరీలు పది శాతానికి పైగానే పెరగనున్నాయి. 46 శాతం సంస్థలు ఈ సంవత్సరం.. ఉద్యోగుల వేతనాలను రెండంకెల శాతం పెంచాలని భావిస్తున్నాయి. కనీసం 10 పాయింట్ 3 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాయి. టెక్నాలజీ రంగంలో 12 పాయింట్ 9 శాతం, ఇ-కామర్స్ సెక్టార్లో 12 పాయింట్ 2 శాతం హైక్స్ ఇవ్వనున్నాయి.
Business Headlines 03-03-23: తెలంగాణకి ఫాక్స్‌కాన్ సంస్థ: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి అంతర్జాతీయంగా పేరొందిన సంస్థల్లో ఫాక్స్‌కాన్ ఒకటి. ఈ కంపెనీ తెలంగాణలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. భారీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని సర్కారు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో ఇండియాకి వచ్చిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్లలో ఇదొకటని తెలిపింది.
Today Stock Market Roundup 02-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. 8 రోజుల నష్టాల తర్వాత నిన్న బుధవారం లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లో ఇవాళ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ రోజు గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న రెండు కీలక సూచీలు ఇంట్రాడేలో కూడా కోలుకోలేకపోయాయి. ఐటీ మరియు బ్యాంకులు, ఆటోమొబైల్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కోవటంతో సాయంత్రం భారీ నష్టాల్లో ముగిశాయి.
Indian companies Q3 earnings: ఇండియన్ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్లో మంచి ఫలితాలు సాధించాయి. విశ్లేషకుల అంచనాలకు మించి లాభాలు ప్రకటించాయి. ద్రవ్యోల్బణం దిగిరావటం వల్ల రాబడులు పెరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, ఆటోమొబైల్ రంగాలు ఈ ఆదాయ వృద్ధిలో ముందంజలో నిలిచాయి. అదే సమయంలో ఆయిల్, గ్యాస్, మెటల్ సెక్టార్లు వెనుకంజ వేశాయి. ఈ 3 నెలల్లో వస్తుసేవల వినియోగం తగ్గుముఖం పట్టింది.