Success Journey of Augustus: రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి అతికొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంపెనీ.. శ్రేయ. ఈ స్థిరాస్తి సంస్థ.. సామాన్యుల సొంతింటి కలలను సాకారం చేసే సరైన వేదికగా నిలుస్తోంది. అంతేకాదు.. వేల మందికి ఉపాధి చూపుతోంది. ఈ కంపెనీని ఇంత సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న వ్యక్తి అగస్టస్. శ్రేయ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. జీవితంలో పైకి రావాలంటే ఒకరి కింద ఉద్యోగం చేయటం కరెక్ట్ కాదని గ్రహించి బయటికి వచ్చి సొంత సంస్థను స్థాపించారు. తద్వారా ఇవాళ ఉన్నత స్థితికి చేరుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా రాణించాలో ఆయన మాటల్లో..
read more: Farmers Income: ఈ ఏడాది అన్నదాతల పంట పండినట్లే!!
‘‘భూమి అమ్మినవాళ్లు, కొనుక్కున్నవాళ్లు ఇద్దరూ గెలిచే గేమ్.. రియల్ ఎస్టేట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్‌స్టైల్ మారాలన్నా దానికి చక్కని మార్గం ఈ రంగమే. రియల్ ఎస్టేట్ సంస్థలో కొలువు చేస్తే వర్క్ ప్రెజర్ ఉండదు. పీస్‌ఫుల్‌గా, హెల్దీగా పనిచేసుకోవచ్చు. సామాన్యులను అసామాన్యులుగా మలిచేది రియల్ ఎస్టేట్. ఒక్క ప్లాటైనా కొనుక్కోగలిగితే అది మన కుటుంబానికి భరోసాగా మిగిలిపోతుంది. ఒక అసెట్‌గా ఉంటుంది. జాబ్ కన్నా ఈ ఫీల్డ్‌లో శాటిస్‌ఫ్యాక్షన్ ఎక్కువ. ఇందులో బిజినెస్ జరగకపోవటం ఉండదు. అన్ సీజన్ అనేది లేదు. మా సంస్థలో 7-8 వేల మంది టీమ్ పనిచేస్తోంది. కరోనా టైంలోనే ఎక్కువ బిజినెస్ చేశాం.
ఇక్కడ విజయం అనేది మార్కెట్ మీద ఆధారపడదు. టీమ్ మీద ఆధారపడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో అప్ అండ్ డౌన్స్ ఉండవు. ఆల్వేస్ గోయింగ్ అప్. మా అసోసియేట్సే ఇందులోని సక్సెస్‌ఫుల్ పర్సన్స్. హైదరాబాద్ నగరం లవబుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇంట్రస్టింగ్ ఏరియా. ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని అందరూ ఆశిస్తుంటారు. సిటీలో ఒక్క ప్లాటైనా కొనాలనేది చాలా మంది లైఫ్ టైమ్ డ్రీమ్. వాళ్లందరి కలలను నెరవేర్చే పనిలోనే మేమున్నాం. అందర్నీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ రంగంలో గెలవాలనుకున్నవాళ్లకు మా సంస్థ కేరాఫ్ అడ్రస్. మధ్యతరగతి ప్రజలను ఫైనాన్షియల్ అప్‌గ్రేడింగ్ చేస్తున్నాం.
ప్రతి ఇంటికీ శ్రేయా సంస్థను చేర్చాలనేది మా లక్ష్యం. ప్రతి ఒక్కరికీ ఒక ప్లాట్ ఉండేలా.. వాళ్లకు ఒక భరోసా కలిగేలా చేయాలి. ఉద్యోగం అనేది మెకానికల్ లైఫ్‌లా ఉంటుంది. నా ఇన్‌కంని నేను డిసైడ్ చేసుకోలేను. వేరేవాళ్లు నిర్ణయిస్తారు. మన లైఫ్ మన చేతిలో ఉండదు. బాస్ డిసైడ్ చేస్తాడు. ఎన్ని గంటలకు రావాలి? ఎన్ని గంటలకు వెళ్లాలి? ఇలాంటివేవీ మన కంట్రోల్‌లో ఉండవు. మన ప్రతి షెడ్యూలూ మనం పనిచేసే సంస్థవాళ్ల చేతిలోనే ఉంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే.. నాకు నచ్చకపోయినా నేనే బయటికి వెళ్లిపోవాలి.. వాళ్లకు నచ్చకపోయినా నేనే వెళ్లిపోవాలి.
రొటీన్ లైఫ్. కానీ.. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అలా కాదు. ఇందులో వర్క్ చేసేవాళ్లు పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. పైగా.. ఇక్కడికి వచ్చాక మనకు ఫైనాన్షియల్ ఫ్రీడం వస్తుంది. అంతేకాదు. రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ రేట్ ఎక్కువ. భూమి బంగారంతో సమానం. భూమ్మీద పెట్టుబడి పెడితే సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రాఫిట్స్ అధికం. భూమి కొనటానికి చేతిలో డబ్బులు లేవని వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. యుద్ధం ప్రకటిస్తే ఆయుధాలు వాటంతటవే వస్తాయి. రియల్ ఎస్టేట్‌లో ఉద్యోగం అనేది అనుకున్నంత టఫ్ జాబేమీ కాదు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం. వంద శాతం రిటర్న్స్ వస్తాయి.