Stock Market Roundup 09-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం బాగా బలహీనపడింది. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా పెంచనుందనే భయాలు ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌ని వెంటాడాయి. దీంతో.. ఉదయం నుంచే రెండు కీలక సూచీలు నష్టాల బాట పట్టాయి. సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. బెంచ్ మార్క్‌కి దిగువన ఎండ్ అయ్యాయి.
సెన్సెక్స్ 541 పాయింట్లు కోల్పోయి 59 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 164 పాయింట్లు తగ్గి 17 వేల 589 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ రాణించాయి. ఈ సంస్థల స్టాక్స్ వ్యాల్యూ ఒకటీ పాయింట్ 8 శాతం వరకు పెరిగాయి.
read more: India’s Top 10 Richest Women: ఇండియాలోని టాప్-10 సంపన్న మహిళలు
నిఫ్టీలో హిండాల్కో మరియు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు మంచి పనితీరు కనబరిచాయి. ఐసీఐసీఐ బ్యాంక్, మహింద్రా అండ్ మహింద్రా, టీసీఎస్, ఎస్‌బీఐ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్.. రెండు ఇండెక్స్‌ల్లోనూ నేలచూపులు చూశాయి.
రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ ఐటీ, ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు వెనకబడ్డాయి. మెటల్ ఇండెక్స్ మాత్రం ఒక శాతానికి పైగా పెరిగింది. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. సీక్వెంట్ సైంటిఫిక్ షేర్ల వ్యాల్యూ 12 శాతం పెరిగింది. రిలయెన్స్ స్టాక్ విలువ ఘోరంగా దెబ్బతిన్నది.
10 గ్రాముల బంగారం ధర అతిస్వల్పంగా 26 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 54 వేల 937 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటులో కూడా చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. గరిష్టంగా 61 వేల 809 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ ధర 18 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 287 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 5 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 98 పైసల వద్ద స్థిరపడింది.