Today Business Headlines 16-03-23:
హైదరాబాద్‌కి బ్లాక్‌బెర్రీ
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. ఐఓటీ.. రంగంలో కెనడాకు చెందిన కంపెనీ బ్లాక్‌బెర్రీ ఈ ఏడాది హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ సంస్థకు కెనడా తర్వాత ఇదే అతి పెద్ద కేంద్రం కానుండటం విశేషం. ఇందులో వంద మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు లభించనున్నాయి. సీనియర్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంటిగ్రేషన్, సర్వీస్ డెలివరీ తదితర జాబులు అందుబాటులోకి వస్తాయి. నెక్‌స్ట్ జనరేషన్ టెక్నాలజీ మరియు స్కిల్స్‌తో పనిచేస్తారు.
తగ్గిన వాణిజ్య లోటు
మన దేశ ఎగుమతులు, దిగుమతులు రెండూ తగ్గాయి. దీంతో.. వాణిజ్య లోటు కూడా దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో గిరాకీ మందగించటమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇండియా ఎక్స్‌పోర్ట్‌లు వరుసగా మూడో నెలలో సైతం పడిపోవటం గమనించాల్సిన విషయం. ఫిబ్రవరిలో 8 పాయింట్ 8 శాతం తగ్గి 33 పాయింట్ ఎనిమిదీ ఎనిమిది బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇంపోర్టులు ఫిబ్రవరిలో 8 పాయింట్ రెండూ ఒకటి శాతం తగ్గి 51 పాయింట్ మూడు ఒకటి బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య లోటు ఏడాది కనిష్టమైన 17 పాయింట్ నాలుగు మూడు బిలియన్ డాలర్లకు చేరింది.
బియానీ ఈజ్ బ్యాక్
ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ బోర్డ్ చైర్మన్ మరియు డైరెక్టర్ పదవులకు జనవరిలో రాజీనామా చేసిన కిషోర్ బియానీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు ఈ నెల 10వ తేదీన ఎక్స్ఛేంజ్‌లకు తెలిపారు. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్.. అప్పుల్లో కూరుకుపోయి రద్దయి ప్రస్తుతం దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దివాలా పరిష్కార నిపుణుడు.. బియానీ రాజీనామాపై అబ్జెక్షన్ చెప్పారు. ఆయన తిరిగి పదవుల్లోకి రావాలని సూచించారు. దీంతో కిషోర్ బియానీ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
జీఎస్‌టీ అప్‌డేట్
వస్తు సేవల పన్ను.. జీఎస్‌టీ.. సంబంధిత వివాదాలను సత్వరం పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పడనున్నాయి. ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు. ఈ నలుగురిలో ఇద్దరు టెక్నికల్ టీమ్ మెంబర్స్ కాగా మరో ఇద్దరు జ్యుడిషియల్ టీమ్ మెంబర్స్. టెక్నికల్ టీమ్‌లోని ఒకరిని రాష్ట్రం నుంచి, మరొకరిని కేంద్రం నుంచి నియమిస్తారు. ప్రతి రాష్ట్రంలోని అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో రెండు డివిజన్ బెంచ్‌లు ఉంటాయి. దీంతో ఎక్కవ సంఖ్యలో అప్పీల్స్ పరిష్కారమవుతాయి. వీటికితోడుగా ఢిల్లీలో నేషనల్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది.
రానా మీడియా
యాక్టర్, ప్రొడ్యూజర్, ఎంట్రప్రెన్యూర్ అయిన రానా దగ్గుబాటి ప్రారంభించిన స్పిరిట్ మీడియాకి గృహాస్ సంస్థ నుంచి నిధులు సమకూరాయి. అయితే.. ఎంత ఫండ్ వచ్చిందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. స్పిరిట్ మీడియా అనేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లీడ్ గ్రోత్ మోడల్‌ని ఫాలో అవుతోంది. టీవీ, సినిమా, డిజిటల్ మీడియా వంటి సెక్టార్లలో సర్వీసులు అందిస్తోంది. తద్వారా ఇంటర్నేషనల్ లెవల్‌లో వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటోంది. నిఖిల్ కామత్ మరియు అభిజిత్ పాయ్ ఆధ్వర్యంలోని గృహాస్ కంపెనీ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ రావటం పట్ల రానా దగ్గుబాటి హర్షం వ్యక్తం చేశారు.
‘ఆర్బీఐ’కి అవార్డు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్‌బీఐ.. గవర్నర్ శక్తికాంతదాస్‌కి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. సెంట్రల్ బ్యాంకింగ్ అనే పత్రిక ఆయన్ని ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్-2023’ పురస్కారానికి ఎంపిక చేసింది. సంక్లిష్ట సమయాల్లో సమర్థవంతమైన ద్రవ్య విధానాల ద్వారా ఇండియన్ ఎకానమీని విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారని ప్రశంసించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆటుపోట్లకు గురికాకుండా చూడటంలో శక్తికాంతదాస్ ప్రదర్శిస్తున్న అత్యుత్తమ పనితీరుకు గుర్తుగా ఈ అవార్డుకు సెలెక్ట్ చేసినట్లు సెంట్రల్ బ్యాంకింగ్ పత్రిక పేర్కొంది.