AP Budget: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న గురువారం కొత్త పొద్దు పొడిచింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి కొత్త పద్దు సమర్పించారు. 2023-24 సంవత్సరానికి 2 లక్షల 79 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. కీలక రంగాల్లో ఒకటైన సంక్షేమానికి అత్యధికంగా 51 వేల 345 కోట్ల రూపాయలు కేటాయించారు. అనంతరం.. వ్యవసాయానికి 41 వేల 436 కోట్లు విడుదల చేయనున్నారు.
read more: IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ కానుక?
ఆ తర్వాత.. విద్యకు 32 వేల 198 కోట్ల రూపాయిలు ఇచ్చారు. గ్రామీణాభివృద్ధికి 17 వేల 531 కోట్లు ఖర్చు చేయనున్నారు. వైద్యానికి 15 వేల 882 కోట్ల రూపాయలను, నీటి పారుదల మరియు వరదల నియంత్రణకు 11 వేల 908 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో పొందుపరిచారు. మొత్తం బడ్జెట్‌లోని 2 లక్షల 79 వేల కోట్ల రూపాయల్లో 2 లక్షల 6 వేల కోట్ల రూపాయలు రెవెన్యూ వసూళ్ల రూపంలో వస్తాయని సర్కారు పేర్కొంది.
అయితే.. రెవెన్యూ వ్యయం మాత్రం ఇంత కన్నా ఎక్కువే.. అంటే.. 2 లక్షల 28 వేల కోట్ల రూపాయలు చేస్తామని తెలిపింది. ఫలితంగా.. రెవెన్యూ లోటు 22 వేల 316 కోట్ల రూపాయలుగా నమోదు కానుందని వెల్లడించింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14 లక్షల 49 వేల 501 కోట్లు సాధిస్తామని ప్రకటించింది.
10 శాతం వృద్ధి జరుగుతుందని అంచనా వేసింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో రుణాలను 35 శాతం కన్నా తక్కువకు పరిమితం చేస్తామని తెలిపింది. ఎక్సైజ్ సుంకం ద్వారా 18 వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.