Today Stock Market Roundup 17-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని లాభాలతో ముగించింది. ట్రేడింగ్‌కి సంబంధించి.. వీకెండ్ రోజైన ఇవాళ శుక్రవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్‌ల నుంచి బలమైన సంకేతాలు రావటంతో శుభారంభం లభించింది. కానీ.. ఇంట్రాడేలో ఊగిసలాటకు గురయ్యాయి. చివరికి పాజిటివ్ జోన్‌లోకి టర్న్ అయ్యాయి.
దీంతో నిఫ్టీ మిడ్‌క్యాప్100, స్మాల్‌క్యాప్100.. సున్నా పాయింట్ 6 శాతం పెరిగాయి. రంగాల వారీగా చూసుకుంటే.. నిఫ్టీ ఐటీ, రియాల్టీ ఇండెక్స్‌లు రాణించాయి. మీడియా సూచీ మాత్రం ఘోరంగా దెబ్బతిన్నది. 2 శాతం పడిపోయింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్ విలువ ఒక శాతం డౌన్ అయింది. తద్వారా ఒక నెల కనిష్టానికి పతనమైంది.
read more: AP Budget: A to Z ఏపీ బడ్జెట్
ఎండీ అండ్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేయటం ఈ సంస్థకు కొంచెం మైనస్ అయింది. స్టెర్లింగ్ టూల్స్ కంపెనీ షేర్ విలువ పది శాతం ర్యాలీ తీసింది. ఫలితంగా ఐదేళ్ల గరిష్టానికి.. అంటే.. 392 రూపాయల 60 పైసలకి చేరింది. చివరికి.. సెన్సెక్స్ 355 పాయింట్లు పెరిగి 57 వేల 989 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. 114 పాయింట్లు పెరిగి 17 వేల 100 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మంచి పనితీరు కనబరచగా.. టీసీఎస్, హెచ్‌యూఎల్, రిలయెన్స్ వెనకబడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అల్ట్రాటెక్, హిండాల్కో, నెస్లె ఇండియా, జేఎస్‌డబ్ల్యూ లాభాలు ఆర్జించగా పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్, ఎన్‌టీపీసీ నష్టాల బాట పట్టాయి. 10 గ్రాముల బంగారం రేటు 252 రూపాయలు పెరిగింది.
గరిష్టంగా 58 వేల 258 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 569 రూపాయలు పెరిగి అత్యధికంగా 67 వేల 100 రూపాయలు పలికింది. క్రూడాయిల్ రేటు అతిస్వల్పంగా 15 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడిచమురు 5 వేల 710 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 33 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 46 పైసల వద్ద స్థిరపడింది.