Today Stock Market Roundup 16-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం తీవ్ర ఊగిసలాటకి గురైంది. ఈ వారంలో మొదటి 3 రోజులు లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమై స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఎట్టకేలకు వరుసగా ఐదు రోజుల నుంచి వస్తున్న నష్టాలకు బ్రేక్ పడింది. ఎఫ్‌ఎంసీజీ మరియు బ్యాంకింగ్ సెక్టార్లలోని కొన్ని కంపెనీల షేర్లు బాగా రాణించాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ విలువ ఇంట్రాడేలో 52 వారాల కనిష్టానికి.. అంటే.. 2 వేల 207 రూపాయలకి పడిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 1 పాయింట్ 3 శాతం వ్యాల్యూ డౌన్ అయింది. ఏడాది కిందటి వరస్ట్ పెర్‌ఫార్మెన్స్‌ని రిపీట్ చేసింది. దీంతో ఆ సంస్థకు దిమ్మతిరిగినట్లయింది. మరోవైపు.. పతంజలి ఫుడ్స్‌లోని ప్రమోటర్ హోల్డింగ్‌ని స్టాక్స్ ఎక్స్ఛేంజ్‌లు స్థంభింపచేయటంతో ఆ కంపెనీ షేర్ విలువ 5 శాతం పతనమైంది.
read more: IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ కానుక?
సెన్సెక్స్ 78 పాయింట్లు పెరిగి 57 వేల 634 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 16 వేల 985 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో నెస్లె ఇండియా, టైటాన్, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్ తదితర సంస్థలు మంచి పనితీరు కనబరిచాయి. టాటా స్టీల్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వెనకబడ్డాయి.
ఎన్‌ఎస్‌ఈలో ఏసియన్ పెయింట్స్, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్ వంటి కంపెనీలు లాభాలు పొందగా విప్రో, హెచ్‌సీఎల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ నష్టాల బాటలో నడిచాయి. 10 గ్రాముల బంగారం రేటు 171 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 58 వేల 165 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి ధర 101 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 67 వేల 400 రూపాయలు పలికింది. క్రూడాయిల్ రేటు 89 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడిచమురు 5 వేల 653 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 7 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 75 పైసల వద్ద స్థిరపడింది.