Prayagraj Stray Dog Crisis: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ నగరంలో వీధికుక్కల సంఖ్య 1 లక్ష 15 వేలు దాటింది. ప్రతి నెలా నాలుగు వేలకు పైగా కుక్క కాటు సంఘటనలు జరుగుతున్నాయి. వీధికుక్కల కారణంగా ప్రతి నెలా వందలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బ్యాంకు మేనేజర్‌ను ఒక వీధికుక్క వెంబడించింది. తప్పించుకుని పారిపోతుండగా.. మున్సిపల్ చెత్త ట్రక్కు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన ఒక్కసారిగా నగరంలో కలకలం సృష్టించింది.
Online Game: లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. బీఐపీఎస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న యష్ కుమార్(12) అనే బాలుడు ఆన్లైన్ గేమ్‌లో భారీ మొత్తాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. యష్ తండ్రి సురేష్ కుమార్ యాదవ్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతను రెండు సంవత్సరాల క్రితం తన భూమిని అమ్మి యూనియన్ బ్యాంక్ బిజ్నోర్ బ్రాంచ్‌లో రూ.13 లక్షలు డిపాజిట్ చేశాడు. సోమవారం, సురేష్ తన పాస్‌బుక్‌ను అప్డేట్ చేశాడు. ఖాతాలోని రూ. 13 లక్షలు ఖాళీ అయినట్లు…
ACB Raids: హైదరాబాదులో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఏడీఈగా పని చేస్తున్న అంబేడ్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏక కాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు మరో మరి కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో అంబేడ్కర్ నివాసం ఉంటున్నారు. నాననక్రాంగూడలోని ఆంట్యార్ అబ్డే అపార్ట్మెంట్ లోని అంబేడ్కర్ పర్సనల్ కార్యాలయం ఉంది.
100% Muslim Country: ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. దాదాపు అన్ని దేశాల్లో విభిన్న మతాలకు చెందిన వాళ్లు నివసిస్తుంటారు. ప్రతి దేశంలో మెజార్టీ మతాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం. 100% ముస్లిం జనాభా ఉన్న దేశంలో గురించి చర్చిద్దాం. వాస్తవానికి.. ఒకప్పుడు ఈ దేశాన్ని హిందు రాజులు పాలించారు. కానీ.. కాల క్రమేణా ఇది ముస్లిం దేశంగా మారిపోయింది. ఆ దేశం పేరేంటి? అని ఆలోచిస్తున్నారు.
Aarogyasri: రాష్ట్రంలోని దవాఖానల్లో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా యాజమాన్యాలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి సేవలు నిలిపివేశాయి. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించపోవడంతో రూ.1400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.
ITR Filing Extension: ట్యాక్స్ పేయర్స్కి గుడ్‌న్యూస్ వచ్చింది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ మరో రోజు పొడిగించింది. నిన్నటితో చివరితేదీ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ 16న ITR దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఈ సమాచారాన్ని అందించింది. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా కొందరు రిటర్న్‌లను దాఖలు చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారని, అందుకోసమే ఈ…
Hair Fall: జుట్టు రాలడం చాలామంది ప్రధాన సమస్యగా మారుతోంది. జుట్టు అందంగా, పొడుగ్గా పెరగాలని కోరుకునే ప్రతి అమ్మాయి కలను ఈ జుట్టు రాలడం అనే సమస్య చిదిమేస్తూ ఉంటుంది. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, జుట్టుకు వాడే ఉత్పత్తులు, మానసిక ఒత్తిడి, తలస్నానానికి వాడే నీరు.. ఇలా చాలా విషయాలు జుట్టు రాలడానికి కారణం అవుతాయి. అయితే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దానికి కారణం.. హ్యాండ్‌షేక్. ఎందుకంటే టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సల్మాన్ అలీ అఘాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా.. శివం దుబేతో కలిసి కెప్టెన్ సూర్య పాకిస్థాన్ జట్టును పట్టించుకోలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 'హ్యాండ్ షేక్ వివాదం' అంశాన్ని ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ముందు లేవనెత్తింది.
PM Modi: సిగరెట్, పొగాకు, బీడీలపై కేంద్రం నిర్ణయించిన జీఎస్టీలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ పెట్టిన పోస్టు వివాదానికి దారి తీసింది. బీడీ, బిహార్ ‘బి’తోనే మొదలవుతాయని పేర్కొనడంపై ఇప్పటికే బీజేపీ మండిపడింది. తాజాగా బీడీ-బీహార్ వివాదంపై కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)పై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం విమర్శలు గుప్పించారు. పూర్ణియా విమానాశ్రయంలో తాత్కాలిక టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థా;ఉనలు చేశారు. పూర్ణియాలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఓవైపు.. బీహార్ పురోగతి సాధిస్తుంటే.. మరోవైపు రాష్ట్రాన్ని అవమానించడంలో…
Supreme Court: చికిత్స తర్వాత రోగి కోలుకోకపోయినా లేదా మరణిస్తే వైద్యుడు బాధ్యత వహించలేడని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రసవం అనంతరం ఓ మహిళ మరణానికి వైద్యుడే(గైనకాలజిస్ట్) బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విచారణ సందర్భంగా, జస్టిస్ సంజయ్ కుమార్, సతీష్ చంద్రలతో కూడిన ధర్మాసనం.. సంచలన వ్యాఖ్యలు చేసింది. శస్త్రచికిత్స విజయవంతం కాకపోతే లేదా ఆశించిన ఫలితం సాధించకపోతే ఆ వైద్యుడిని నిందించడం సరికాదని పేర్కొంది. ఏ వివేకవంతమైన ప్రొఫెషనల్ వైద్యుడు ఉద్దేశపూర్వకంగా […]