Uttam Kumar Reddy: ఇండస్ట్రియల్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పాలసీ అర్థం కాక చేస్తున్నారా..? కావాలని చేస్తున్నారో అర్థం కావడం లేదు.. ఆకస్మికంగా తెచ్చిన పాలసీ కూడా కాదని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద విద్యుత్ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు నిన్న(బుధవారం) ఆరోపించారు. రామగుండం, పాల్వంచ, మక్తల్‌లలో మూడు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం వెనుక.. దాదాపు రూ.50 వేల కోట్ల స్కాం దాగి ఉందని ఆరోపణలు చేశారు. ఈ అంశంపై తాజాగా మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు.
READ MORE: Devineni Avinash: జగన్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. విజయవతం చేయడంలో మేమే ఫస్ట్..!
ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది.. ప్రజలు నివసించే పరిస్థితి కూడా లేదు.. హైదరాబాద్‌కి అలాంటి పరిస్థితి రావద్దు.. పొల్యూషన్ ఫ్రీ చేయాలని ఆలోచన చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.. “కుంభకోణం అనేది అవాస్తవం.. ఇండస్ట్రీ లను ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉండాలి అని మా ఆలోచన.. అధికారులు, పారిశ్రామిక వేత్తలు, పర్యావరణ వేత్తలతో మాట్లాడి తీసుకున్న పాలసీ ఇది.. పారదర్శకంగా తీసుకువచ్చిన పాలసీ ఇది.. ఓ పెద్ద మనిషి మేము వస్తే పాలసీ మారుస్తాం అంటున్నారు.. మీరు అధికారంలోకి వచ్చేది లేదు.. రద్దు చేసేది లేదు.. పారిశ్రామిక వేత్తలకు అప్పీల్ చేస్తున్నా.. పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తీసుకెళ్లండి.. కొత్త పాలసీని ఉపయోగించుకోండి.. కాంగ్రెస్ ఏం చేసినా బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తుంది.. బద్నాం చేయాలని డిసైడ్ అయ్యింది. విద్యుత్తులో 50 వేల కోట్ల కుంభకోణం అని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఐదు రూపాయల అవినీతి కూడా లేదు.. థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టింది ఎవరు.. బీఆర్ఎస్ కాదా..? NTPC ద్వారా 4 వేల కోట్లతో పవర్ ప్లాంట్ పెడతాం అని వస్తే…ఎందుకు పూర్తి చేయలేదో చెప్పండి.. మీరు చేసిన కక్కుర్తి కి మమ్మల్ని అంటే ఎలా? భద్రాచలంలో సబ్ క్రిటికల్ ప్లాంట్ ఎందుకు పెట్టారు..? కేంద్రం సబ్ క్రిటికల్ ప్లాంట్స్ వద్దు అన్నా… పెట్టింది ఎవరు..?” అని మంత్రి ప్రశ్నించారు.
READ MORE: ED Raids: మెడికల్ కాలేజీ అనుమతుల కోసం లంచాలు.. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఈడీ రైడ్స్..