PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏ అంశంపై ప్రసంగిస్తారు అనే సమాచారం లేదు. అయితే.. రేపుటి నుంచి జీఎస్టీ 2.0 అమలు కానుంది. ఈ జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ సమాచారం అందించవచ్చని భావిస్తున్నారు. జీఎస్టీ 2.0లో భాగంగా.. అనేక ఉత్పత్తులపై రేట్లు తగ్గనున్నాయి. గతంలో జీఎస్టీలో నాలుగు స్లాబులు ఉండటా.. ప్రస్తుతం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇందులో 12%, 28% పన్ను స్లాబ్‌లు తొలగిస్తూ నిర్ణయం…
H1B Visa Fees: ట్రంప్.. H1B వీసా వార్షిక రుసుమును సడెన్‌గా లక్ష డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 88 లక్షలకుపైనే) పెంచిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తరువాత ఇందుకు గల కారణాన్ని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అనేక అమెరికన్ కంపెనీలు అమెరికన్ టెక్ కార్మికులను తొలగించి, వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకున్నాయని వైట్ హౌస్ చెబుతోంది. అమెరికా వనరులు, ఉద్యోగాలపై అమెరికన్లకే మొదటి హక్కు ఉందని ట్రంప్ పదే పదే పేర్కొన్న విషయం విధితమే.
Charlapally Murder Case: చర్లపల్లి ప్రాంతంలో మహిళ డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీ వీడింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. చంపి.. డెడ్ బాడీని తీసుకు వచ్చి పడేసిన సీసీ ఫుటేజీ లభించింది. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హత్య చేశాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇది.. చర్లపల్లి రైల్వే స్టేషన్. దీన్ని ఇటీవల అంతర్జాతీయ రైల్వే స్టేషన్ తరహాలో తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాంటి నిఘా ఉన్న ప్రాంతంలోనే ఓ వ్యక్తి.. తాపీగా వచ్చి మహిళ డెడ్…
Imtiaz Ali: యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే దర్శకుడు ఇంతియాజ్ అలీ. తన సినిమాల్లోని నటీనటుల మధ్య నిజమైన బాండింగ్ ఏర్పడాలనుకుంటాడు. వరుసగా హిట్లు కొట్టి, థియేటర్లలో ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించే చిత్రనిర్మాతగా పేరుగాంచాడు. అతని తండ్రి మన్సూర్ అలీ కాంట్రాక్టర్, ఇరిగేషన్లో పనిచేశాడు. అతని మామ టీవీ నటుడు, దర్శకుడు ఖలీద్ అహ్మద్. ఇంతియాజ్ జబ్ వి మెట్, లవ్ ఆజ్ కల్, రాక్‌స్టార్, హైవే, తమాషా, జబ్ హ్యారీ మెట్ సెజల్, అమర్ […]
Ind vs Pak: ఆసియా కప్ 2025లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పుడు తన మొదటి సూపర్ 4 దశ మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తాజాగా ఈ మ్యాచ్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారని…
CAG Report: భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇటీవల, జపాన్ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. రాబోయే 2.5 నుంచి 3 సంవత్సరాలలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఇటీవల అంచనా వేశారు. కానీ.. అప్పులు కుప్పలు సైతం అంతే వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలోని 28 రాష్ట్రాల ఉమ్మడి అప్పు గత దశాబ్దంలో మూడు రెట్లు పెరిగిందని […]
India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ సెప్టెంబర్ 21 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. సూర్యకుమార్ నేతృత్వంలోనే జట్టు ఈ మ్యాచ్‌లో కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తోంది.
Why Indians Prefer the USA: H-1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీల్లో భయాన్ని నింపాయి. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. దీంతో ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు భారీ ముల్యంగా దీన్ని భావిస్తున్నారు. అయితే.. ఈ అంశంపై తాజాగా స్పందించిన ట్రంప్.. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చర్యను టెక్…
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన పహల్గాం వివాదం తర్వాత తొలిసారిగా క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మైదానంలోనూ ఘోరంగా అవమానించింది. అయితే, సంప్రదాయానికి భిన్నంగా, మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికీ నిరాకరించారు. ఈ విషయంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ అసంతృప్తి వ్యక్తం చేయగా, తన చర్యను భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సమర్థించుకున్నాడు.
Surya Grahanam 2025: హిందూ మతంలో సూర్య గ్రహణానికి ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది. సెప్టెంబర్ నెలలో అంటే ఒకే నెలలో సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తున్నాయి. హిందూ శాస్త్రాల ప్రకారం ఇలా రావడం అపశకునంగా భావిస్తారు. అయితే.. రేపు ఆదివారం అమావాస్య. అంతే కాకుండా.. పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం మనదేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం వర్తించదు. అయితే.. […]