Adilabad: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. నామినేషన్ రోజు మరో సర్పంచ్ ఏకగ్రీవమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను సైత ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తేజపూర్ గ్రామపంచాయతీకి పరిధిలోని సాలెగుడా, డోబ్బిగూడ , తేజపూర్ గ్రామ పటేల్‌ల ఆధ్వర్యంలో సమావేశమై స్వచ్ఛందంగా ఎన్నికలు నిర్వహించకుండా కోవా రాజేశ్వర్‌ను సర్పంచ్‌గా మరో 8 మంది వార్డు సభ్యులను ఎన్నుకున్నారు.
READ MORE: Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజునే తొలి ఏకగ్రీవ ఎన్నిక నమోదు అయింది. రుద్రంగి మండలంలోని రూపులా తండాలో సర్పంచ్ పదవికి జవహర్ లాల్ నాయక్‌ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఏకగ్రీవ నిర్ణయానికి గ్రామ పెద్దలు, యువత, మహిళలు కలిసి మద్దతు తెలపడంతో పోటీ అవసరమే లేకుండా పోయింది. జవహర్ లాల్ నాయక్ ఏకగ్రీవంగా ఎంపికైన వెంటనే తండా అంతటా టపాసులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు.
READ MORE: West Bengal: బెంగాల్‌లో ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా.. సె*క్స్ వర్కర్లలో “S.I.R” భయం..