Hyderabad: వీడిన అంబర్‌పేట్ ఎస్సై తుపాకీ మిస్సింగ్ మిస్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: అంబర్‌పేట్ ఎస్సై తుపాకీ మిస్టరీ వీడింది. తుపాకీ ఆచూకీ లభ్యమైంది.. ఇటీవల.. పోటీ పరీక్షల కోసం ఎస్సై భాను ప్రకాష్ విజయవాడకు వెళ్లాడు.. అక్కడ ఒక లాడ్జిలో వారం రోజులు పాటు బసచేశాడు. తనతో పాటు తుపాకీని తీసుకొని వెళ్లాడు. పోటీ పరీక్షలు రాసిన తర్వాత తుపాకీతో ఉన్న బ్యాగు కనిపించకుండా పోవడంతో హైరానా పడ్డాడు. లాడ్జీ సిబ్బందిని నిలదీసినప్పటికీ ప్రయోజనం శూన్యమైంది.. విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చి హైదరాబాద్‌కి చేరుకున్నాడు. భాను ప్రకాష్‌ని అదుపులోని తీసుకొని విచారించగా లాడ్జీలో మర్చిపోయినట్లు తెలిపాడు. దీంతో తుపాకీ కోసం రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విజయవాడకు పంపారు పోలీసులు.. మరోవైపు.. బెట్టింగులో భాను ప్రకాష్ కోటి 25 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు గుర్తించారు.
READ MORE: Pakistan: “ఇమ్రాన్ ఖాన్‌కి ఏమైంది..?” పాకిస్థాన్ పార్లమెంట్‌లో గందరగోళం..
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ఇంతకీ ఏం జరిగింది..?
హైదరాబాద్ పోలీస్ శాఖకు మచ్చతెచ్చే విధంగా అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ భాను ప్రకాష్ ప్రవర్తించిన తీరు పెద్ద వివాదంగా మారింది. బెట్టింగ్‌లలో బాగా మునిగిపోయి అప్పుల పాలైన భాను ప్రకాష్, ఆర్థిక ఇబ్బందులు తీర్చుకునేందుకు చట్టవిరుద్ధ మార్గాలు ఎంచుకున్నట్టు బయటపడింది. ఓ రికవరీ కేసులో స్వాధీనం చేసిన ఐదు తులాల బంగారాన్ని తన సొంత ప్రయోజనాలకు వాడుకుని పోలీస్ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశాడు. బాధ్యతగా పని చేయాల్సిన స్థానంలో ఉండి నేరాలకు పాల్పడటంతో భాను ప్రకాష్‌పై పోలీసు శాఖలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఎస్సై గన్ మిస్ అయినట్లుగా తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు నిలదీశారు. కానీ.. రెండు రోజులుగా నిలదీసినా ఎస్సై భాను ప్రకాష్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే, బంగారంతో పాటు తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టినట్లు తొలుత అనుమానాలు వ్యక్తం అయ్యారు. మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. తుపాకి ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది.
తాజావార్తలు
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?