Rising Political Violence Among U.S. Youth: అమెరికన్ యువతలో కోపం పెరుగుతుందా? ఆ దేశంలో రాజకీయ హత్యలు పెరుగుతన్నాయా? ప్రస్తుతం ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి, గత వారం డొనాల్డ్ ట్రంప్కు దగ్గరగా ఉన్న మితవాద నాయకుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు. హంతకుడు టైలర్ రాబిన్సన్ 22 ఏళ్ల యువకుడు. రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో ట్రంప్ మిత్రుడైన చార్లీ కిర్క్ వ్యవహార శైలి అతడికి నచ్చలేదు. అందుకే హత్య చేసినట్లు తెలుస్తోంది. యూఎస్లో ఇదొక్కటే కాదు..…
CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మత మార్పిడులపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వివాదం చెలరేగింది. హిందూ సమాజంలో సమానత్వం ఉంటే, ఎవరైనా ఎందుకు మతం మారుతారు? అని ఆయన అన్నారు. సమానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది? మనం అంటరానితనాన్ని సృష్టించామా? అని ప్రశ్నించారు. ఇస్లాం, క్రైస్తవ మతం లేదా ఏ మతంలోనైనా అసమానతలు ఉండవచ్చని.. తాము లేదా బీజేపీ ఎవరినీ మతం మారమని అడగలేదన్నారు. కానీ ప్రజలు మతం మారుతున్నారని.. అది వారి హక్కు అన్నారు.
Country With Zero Muslim Population: భారత్ మతపరంగా అత్యంత వైవిధ్య భరిత దేశం. పురాతన హిందూ మతం, ఆధునిక భావాలతో స్థానికంగా పుట్టిన బౌద్ధం, జైనంతోపాటు వలసలతో వచ్చిన ఇస్లాం, క్రైస్తవం సహా అనేక ఇతర మతాలు ఇక్కడ ఉన్నాయి. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు మతాల ద్వారానే మనుగడలోకి వచ్చి విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఫలితంగా భారతీయుల దైనందిన జీవితంలో మతం, మత నియమాలు ప్రధాన భాగాలుగా మారిపోయాయి. భిన్నత్వంలో ఏకత్వానికి సూచికగా, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది […]
Mauritius: భారత ప్రధాని నరేంద్ర మోడీ, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గూలం ఇటీవల వారణాసిలో ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ, ఇతర పారిశ్రామిక సమాఖ్యలతో కలిసి ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన మారిషన్ ఇండియా వ్యాపార సదస్సు (బిజినెస్ కాంక్లేవ్)లో ఆ దేశ ప్రధాని పాల్గోన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి మారిషస్ నాయకుడిని ఆహ్వానించడం తనకు గర్వకారణమని మోడీ అన్నారు. "శతాబ్దాలుగా కాశీ భారతదేశ నాగరికత, సంస్కృతికి ప్రతీకగా…
Adireddy Vasu: మెడికల్ కాలేజీల వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఘాటుగా విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ అన్నట్లుగా రాజమండ్రి మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేమని.. రాజమండ్రిలో ఓహో అనిపించేలా వైసీపీ పార్టీ కార్యాలయం మాత్రం కట్టుకున్నారని ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని రూ. 5 వేల కోట్లు అప్పు చేసిందని, ఆ నిధులు ఎటు దారి మళ్లించాలో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణకు పీపీపీకి మధ్య…
Vijayawada: విజయవాడ BRTS రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫుడ్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యూట్యూబర్లతో కలిసి రీల్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించని యువకులను మందలిస్తున్నట్టు వీడియోలు చేస్తున్న క్రమంలో ఓ సీఐ బూతులు తిట్టారు. దీంతో యువకులు పోలీసులకు ఎదురు తిరిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి మిగతా వాహనదారులు మద్దతుగా నిలిచారు. దీంతో అదనపు సిబ్బందిని ఘటన స్థలానికి రప్పించారు పోలీసులు.. ఈ ఘటనపై సీఐ కిషోర్ యువకులకు క్షమాపణలు చెప్పారు. మద్యం సేవించి ఉన్నామంటూ…
Janasena: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశానుసారం మచిలీపట్నంలో చోటు చేసుకున్న పరిణామంపై అంతర్గత విచారణ ప్రారంభించనున్నట్లు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్, ఏపీ ఎం.ఎస్.ఐ.డి.సి. ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస రావు, మచిలీపట్నం జనసేన నాయకుడు వికృతి శ్రీనివాస్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణతోనూ మాట్లాడి […]
CM Chandrababu: టీటీడీ భక్తులకు సీఎం గుడ్న్యూస్ చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మిస్తున్నారు. నూతన బస్స్టాండ్ అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
Tomato Farmers in Crisis: ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయల ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు.. ప్రస్తుతం ఏపీలో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే టైంలో గిట్టుబాటు ధరలు లభించక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటా ధర దారుణంగా పడిపోయింది.
Nadendla Manohar: దేశ రాజకీయాలలో మార్పు తీసుకురావాలనేది జనసేన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దని.. జనసేన కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోయారని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ మర్చిపోరన్నారు.