Hyderabad: తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు.. బీజేవైఎం కార్యకర్తలు స్వాములతో కలిసి వచ్చారు. స్వాములను పోలీసులు అడ్డుకున్నారు.. కొందరి అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసుల యూనిఫాంపై ఆంక్షలు ఎందుకంటూ నిరసన వ్యక్తం చేశారు అయ్యప్ప స్వాములు.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయంటున్నారు..
READ MORE: TGPSC Group 2 Case: గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు ఊరట
పోలీసులు అయ్యప్ప దీక్ష దుస్తులు వేసుకోవడం తప్పా అని ఓ మాలదారుడు పోలీసులను నిలదీశారు.. “సూటిగా డీజీపీని మేము ప్రశ్నిస్తున్నాం.. ప్రతి సారి హైదరాబాద్‌లో వివాదం ఏర్పడుతుంది.. అయ్యప్ప మాల కోసం యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు ఇవ్వాలి.. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ఇచ్చిన లేఖ చర్చకు దారి తీసింది.. 2025 నవంబర్ 20వ తేదీతో లేఖ ఉంది. లేఖ అయ్యప్ప మాల వేసుకునేందుకు వీలుగా యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.. కంచన్‌బాగ్ స్టేషన్‌కి చెందిన ఎస్సై ఎస్. కృష్ణకాంత్ ఎందుకు నోటీస్ ఇచ్చారు.. తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉన్న ఉత్తర్వుల ప్రకారం, అలా వెసులుబాటు కల్పించడం కుదరదు అంటూ దానికి సమాధానం ఇచ్చారు.. సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ కె శ్రీకాంత్. ఇదే సమాధానాన్ని కృష్ణకాంత్‌తో పాటు ఆ జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకూ పంపారు.. ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి..” అని అయ్యప్ప స్వామి పేర్కొన్నారు.
అసలు ఏం జరిగింది..?
హైదరాబాద్ పాతబస్తీ సౌత్ ఈస్ట్ జోన్‌లో విధులు నిర్వహిస్తున్న కంచన్‌బాగ్ ఎస్‌ఐ ఎస్. కృష్ణకాంత్‌కు అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేయడం వివాదంగా మారింది. డ్యూటీలో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధరించడం పోలీసు విభాగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కృష్ణాకాంత్‌కు అడిషనల్ డీసీపీ మెమో జారీ చేయడంతో అయ్యప్ప స్వాములను ఆగ్రహానికి గురి చేసింది. మతపరమైన ఆచారాలు పాటించే సమయంలో డ్యూటీకి హాజరు కాకుండా సెలవులు తీసుకోవాలని మెమోలో స్పష్టం చేశారు. అయ్యప్ప మాల వేసుకుని డ్యూటీ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని ఆ మెమోలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ మెమో ఇప్పుడు పెద్ద చర్చకు తెరతీసింది.