Devineni Avinash: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95 వేలకు పైగా సంతకాలు పూర్తయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమం అయినా తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని కొనియాడారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ మెచ్చుకున్నారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేశారన్నారు. ప్రభుత్వం చేసే తప్పును ప్రజల్లోకి తీసుకెళ్లారని కొనియాడారు.
READ MORE: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
కడియాల బుచ్చిబాబు పడిన కష్టం వలనే నేడు 95 వేలకు పైగా సంతకాలు పూర్తి చేయగలిగామని NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ప్రతి రోజూ దీని మీద చాలా వర్క్ చేశారు.. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ నియోజకవర్గమే మొదటి స్థానంలో ఉందన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులకు మెడికల్ విద్య దూరం అవుతుందని వాపోయారు. ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలుపుతున్నారన్నారు. జగన్ విలువ ప్రజలు అందరూ ఇప్పుడు తెలుసుకున్నారు.. జగన్ తెచ్చిన మంచి పథకాలన్నీ కూటమి నేతలు నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరు.. రాష్ట్ర ప్రజలు అందరూ జగన్ వెనకాలే ఉన్నారని తెలిపారు. కేసులు పెట్టి బయపెట్టే ప్రయత్నం చేసిన ఎవరు బయటపడటం లేదని.. కూటమి నేతలు చేసిన అబద్ధ ప్రచారాలు ముందు మనం చేసిన అభివృద్ధి కనపడలేదన్నారు.