West Bengal: ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన వెస్ట్ బెంగాల్‌లోని సోనాగాచిలో కొత్త చిక్కు వచ్చి పడింది. అక్కడున్న సెక్స్ వర్కర్లు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు వాళ్లు పాత పెట్టెలు, బీరువాలను తెరుస్తున్నారు. ఇక్కడున్న ప్రతి సెక్స్ వర్కర్ ఒక పత్రం కోసం వెతుకుతున్నారు. వారి గుర్తింపు కార్డు లేదా వారి గుర్తింపును నిరూపించే ఇతర పత్రాలను వెతుకుతున్నారు. ఆ పత్రాలు ఇప్పుడు ఎందుకు ఇంతకీ ఏం జరిగిందనే విషయం గురించి తెలుసుకుందాం..
READ MORE: Andhra King Thaluka : శాటిలైట్ నుంచి ఓటీటీ వరకు.. ‘ఆంధ్ర కింగ్ తాలుకా ’ హక్కులపై గ్రాండ్ డీల్!
బెంగాల్ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ S.I..R (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు సెక్స్ వర్కర్లను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దాదాపు 10,000 మంది సెక్స్ వర్కర్లకు నిలయమైన సోనాగాచిలో సెక్స్ వర్కర్లు అనేక రంగాల్లో సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చాలా మంది బాలికలు, మహిళలు ఉన్నారు. ఇందులో చాలా మందికి తండ్రి, చిరునామా లేదా ఇంటి చిరునామా లేదు. సర్ కోసం ఎన్నికల కమిషన్ అడుగుతున్న పత్రాలు వీరి వద్ద లేవు. ముఖ్యంగా 2002 ఓటర్ల జాబితా నుంచి ఇప్పటి వరకు వీళ్లకు సంబంధించి కుటుంబ వివరాల రుజువులు ఉనికిలో లేవని చెబుతున్నారు.
READ MORE: India Post: పోస్టల్ శాఖ నుంచి సీనియర్ సిటిజన్‌లకు కొత్త సేవింగ్స్ స్కీమ్
ఎందుకంటే.. ఇక్కడున్న మహిళలు, యువతులు, బాలికలు వివిధ పరిస్థితులు, మార్గాల ద్వారా సోనాగాచికి వస్తారు. వారిలో చాలా మందికి విషాదకరమైన కథలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే చాలా మంది మహిళలు అక్రమ రవాణాకు గురైనవారే అని చెబుతున్నారు. చాలా మంది మహిళలు ఇంటి నుంచి పారిపోయి ఇక్కడ వ్యభిచార కూపంలో చిక్కుకుంటున్నారు. వారి వద్ద వారి స్వంత సమాచారం ఉన్నప్పటికీ.. ఎన్నికల సంఘం విడుదల చేసిన 2002 ఓటరు జాబితా నుంచి వారి తల్లిదండ్రుల వివరాలను తిరిగి పొందడం వారికి దాదాపు అసాధ్యంగా మారింది. కాబట్టి S.I.R పత్రాలను అందించడం ఈ మహిళలకు దాదాపు అసాధ్యంగా మారింది.