India vs Pakistan: ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో భారత్ పాకిస్థాన్‌తో క్రమంగా అన్ని సంబంధాలను తెంచుకుంది. కానీ.. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ.. ఆదివారం శివసేన (UBT) మహారాష్ట్ర అంతటా వీధి నిరసనలు నిర్వహించింది. ఇది దేశ ప్రజల మనోభావాలను అవమానించడమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసనల్లో భాగంగా ముంబైలో యూబీటీ ప్రతినిధి ఆనంద్ దూబే..…
India vs China: నేడు భారత్, చైనా మహిళల ఆసియా కప్ హాకీ 2025 ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చైనాలోని హాంగ్జౌలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు వచ్చే ఏడాది ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న మహిళల హాకీ ప్రపంచ కప్‌కు నేరుగా ప్రవేశం పొందుతుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత్‌కు షాక్ తగిలింది. భారత జట్టు అనుభవజ్ఞులైన గోల్ కీపర్ సవితా పూనియా, డ్రాగ్ ఫ్లికర్ దీపికా జూనియర్ లేకుండానే బరిలోకి దిగనుంది. ఈ…
Asaduddin Owaisi: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరగనున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై రాజకీయ, సామాజిక వివాదం ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రతిపక్షాలు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏఐఎంఐఎం చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ మీడియా సంస్థతో ఒవైసీ మాట్లాడుతూ..
Osama Bin Laden: పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సన్నిహితుడు, అధికార ప్రతినిధి ఫర్హాతుల్లా బాబర్ తాను రాసిన కొత్త పుస్తకం ‘‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బీ టోల్డ్’’లో సంచలన విషయాలను పేర్కొన్నారు. అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను తమ భూభాగంపై.. అదీ తమకు తెలియకుండా అమెరికా బలగాలు రహస్యంగా మట్టుబెట్టడం పాకిస్థాన్ నేతలను తీవ్ర అవమానానికి, అయోమయానికి గురిచేసిందని రాసుకొచ్చాడు.. అప్పటి 2011లో అబోటాబాద్‌లో లాడెన్ హత్యానంతరం స్థానికంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను వివరించారు.…
Udaipur Floods: దేశంలోని తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్‌లో సైతం వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాల ధాటికి ఇటీవల ఉదయ్‌పుర్‌కు భారీగా వరదలు వచ్చాయి. అక్కడ ఉన్న అయాద్ నది సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో ఇద్దరు స్నేహితులు కొట్టుకుపోతుండగా.. రెస్క్యూ బృందాలు ఒకరిని కాపాడాయి. మరో మిత్రుడు గల్లంతయ్యాడు. ప్రవాహం నిరంతరం పెరుగుతుండటంతో ఆ యువకుడి జాడ కానరాలేదు. దీంతో ఆ యువకుడి తండ్రి దాదాపు ఇరవై కిలోమీటర్ల పాటు తన కొడుకుని వెతుక్కుంటూ వెళ్లాడు.
KTR: సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.. రేవంత్‌కు దమ్ముంటే 10 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏందో తేల్చుకుందామన్నారు.. జోగులాంబ జిల్లా గద్వాలలోని తేరు మైదానంలో నిర్వహించిన ‘గద్వాల గర్జన’ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు.
UP: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పోలీసులు కంప్యూటర్ సెంటర్ ముసుగులో నడుస్తున్న ఒక స్పా సెంటర్‌ను ఛేదించారు. ఇక్కడ వ్యభిచారం(సె*క్స్ రాకెట్) జరుగుతోందని ఆరోపణలూ ఉన్నాయి. ఈ దాడిలో తొమ్మిది మంది యువతులను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు కస్టమర్లు, ఒక స్పా ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నౌచండి పోలీస్ స్టేషన్ ప్రాంతం నయా సడక్ ఘర్ రోడ్‌లోని ఒక కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
India’s Big Sports Day: క్రీడా ప్రియులకు ఆదివారం ఒక పండగే. ఎందుకంటే.. రేపు భారత్ రెండు వేర్వేరు శత్రు దేశాల జట్లతో తలపడనుంది. ఒక వైపు, దుబాయ్‌లో జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లో టీం ఇండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. మరోవైపు, మహిళల హాకీ ఆసియా కప్ టైటిల్ పోరు హాంగ్జౌ గడ్డపై జరుగుతుంది. భారత హాకీ జట్టు ఆతిథ్యం ఇచ్చిన చైనాతో తలపడనుంది. క్రికెట్, హాకీ రెండు వేర్వేరు ఆటలు అయినప్పటికీ.. ఆసియాలోని రెండు చారిత్రాత్మక ప్రత్యర్థుల మధ్య ఓకే రోజు…
Weight Loss Challenge: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ అరాషి విజన్ ఇంక్. ఈ కంపెనీని ఇన్‌స్టా360 అని కూడా పిలుస్తారు. ఇది తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులు బరువు తగ్గి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి ప్రత్యేకమైన మార్గాన్ని అవలంబించింది. ఈ కంపెనీ ఆగస్టు 12న వార్షిక 'మిలియన్ యువాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్'ను ప్రారంభించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి నియమాలు చాలా సులభం. ఏ ఉద్యోగి అయినా పేరు నమోదు…
Anurag Thakur: ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. కానీ ఈ మ్యాచ్‌ను బ్యాన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ క్రీడా మంత్రి స్పందించారు. క్రికెట్ కౌన్సిల్ (ACC) లేదా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించే టోర్నమెంట్లలో ఇటువంటి మ్యాచ్‌లను ఆపలేమని మాజీ క్రీడా మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం…