China: చైనా కోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులకు మరణశిక్ష విధించింది. ఈ కుటుంబం ఒక క్రిమినల్ ముఠాను నడిపింది. హత్య, మోసం, వ్యభిచారం, మనీలాండరింగ్ లాంటి అనేక తీవ్రమైన నేరాలకు పాల్పడింది. ఈ నేరాలపై విచారణ చేపట్టిన కోర్టు.. వెన్జౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు మయన్మార్‌లోని కోకాంగ్‌లో నివాసం ఉంటున్న మింగ్ గుపింగ్, మింగ్ జెన్జెన్, జౌ వీచాంగ్లతో పాటు మరో ఎనిమిది మందికి మరణశిక్ష విధించింది. కోర్టు మరో ఐదుగురికి రెండేళ్ల సస్పెండ్ మరణశిక్షలు…
Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ నిరాకరించింది. కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. సభలు, ర్యాలీలో నిర్వహించే సమయంలో కనీసం నీళ్ళు కూడా ఎందుకు ఇవ్వలేదని టీవీకే పార్టీని కోర్టు ప్రశ్నించింది. కనీస అవసరాలైన నీళ్ళు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ ఉండేలా ఎందుకు చూసుకోలేదంటూ ప్రశ్నించింది. రోడ్డు సమావేశం ఎర్పాటు ఎందుకు అనుమతి ఇచ్చారని పోలీసులను […]
BJP Andhra Pradesh president PVN Madhav : పెట్రోల్‌పై జీఎస్టీ తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సంచల వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌పై కేంద్రం విధిస్తున్న జీఎస్టీ 18 శాతమేనని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే జీఏస్టీ దీనికి రెండు రెట్లు అదనంగా ఉంటోందని అన్నారు. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో రెండు రోజులు పాటు నిర్వహించిన ఖాదీ సంతను మాధవ్ సందర్శించారు.
Mahatma Gandhi: ఈ రోజు అక్టోబర్ 2వ. మహాత్మా గాంధీ 156వ జయంతి. భారతదేశ స్వాతంత్ర్యాన్ని సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 15వ తేదీ రాత్రి మన దేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ.. ఇస్లాం పేరుతో మన దేశం విభజించబడింది. పాకిస్థాన్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది. విభజనకు మహాత్మా గాంధీ కారణమని చాలామంది నమ్ముతారు. ముస్లింలను సంతృప్తి పరచడానికి జిన్నా డిమాండ్లకు గాంధీ అంగీకరించారని రాడికల్ రైట్-వింగర్లు నమ్ముతారు. READ MORE: Medha […]
Medha Gandhi: నేడు మహాత్మా గాంధీ పుట్టిన రోజు. భారతజాతి ముద్దుగా బాపు అని పిలుచుకునే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869, అక్టోబరు 2న గుజరాత్‌లోని పోరుబందర్లో జన్మించారు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారములు బాగా పాటించే సాంప్రదాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి అసత్యమాడటం గాంధీకి గిట్టని పనిగా చెబుతుంటారు. గాంధీజీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా పోర్‌బందర్‌లోను, రాజ్‌కోట్‌లోనూ కొనసాగింది. గాంధీజీకి 13 ఏళ్ల వయస్సులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూరిబాయితో వివాహము జరిగింది. వీరికి…
Andhra Pradesh GST: ఏపీలో సెప్టెంబర్ మాసంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయి. నికర జీఎస్టీ వసూళ్లలో 7.45 శాతం వృద్ధి సాధించింది. ఈ సెప్టెంబర్‌లో నికర జీఎస్టీ వసూళ్లు రూ.2,789 కోట్లకు చేరుకున్నాయి. జీఎస్టీ శకం ఆరంభమయ్యాక ఆంధ్రప్రదేశ్ రెండోసారి అతి పెద్ద స్థూల రాబడి నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే ఈ సెప్టెంబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లలోనూ 4.19 శాతం వృద్ధి సాధించింది. ఈ సెప్టెంబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3,653 కోట్లకు చేరుకున్నాయి. ధరల తగ్గింపు…
Dussehra 2025: విజయదశమి సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో రావణ దహన వేడుకలకు వర్షం అంతరాయం కలిగించింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఢిల్లీ, పాట్నా, జౌన్పూర్తో సహా అనేక నగరాల్లో ఆకస్మిక వర్షాలు మైదానంలో ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మలను తడిపేశాయి. నోయిడాలోని రాంలీలా మైదానంలో భారీ వర్షం ప్రారంభమవడంతో రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలు నీటితో తడిసిపోయాయి. దిష్టిబొమ్మలను చూడటానికి చాలా మంది జనాలు వచ్చారు. కానీ వర్షం వారు మైదానం వదిలి ఇంటికి వెళ్లిపోయారు.
India vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ మొదటి రోజు ముగించే సరికి.. రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ అర్ధ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. సిరాజ్ నాలుగు వికెట్లు, బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ సైతం…
CM Chandrababu: ఖాదీసంత గాంధీ ఆశయాలకు ప్రతీక అని సీఎం చంద్రబాబు అన్నారు.. మహాత్మాగాంధీ అంటే గుర్తొచ్చేది ఖద్దర్ అన్నారు.. స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రాట్నమే అని గుర్తు చేశారు.. తిండిపెట్డే రైతును గుర్తుపెట్టుకోవాలని లాల్ బహాదుర్ శాస్త్రి చెప్పినట్లు గుర్తు చేశారు. వారానికి ఒకరోజు సంతకు వెళతాం.. గ్లోబల్ సంతగా ఖాదీసంత తయారవుతుందనడానికి అనుమానం లేదు.. విదేశీ వస్త్రాలు, విదేశీ వస్తువులు అప్పుడు బహిరంగంగా తగులబెట్టారు.. అన్నిరకాల విలువలు కలిగిన దేశం భారతదేశం.. మనం ఎంత ఎదిగినా […]
Mohan Bhagwat: భారతీయ వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం మధ్య.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ స్వదేశీ మంత్రాన్ని పునరుద్ఘాటించారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో నాగ్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. అమెరికా సుంకాలు భారతదేశానికి పెద్ద సవాలుగా మారాయన్నారు. దీని ప్రభావం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. స్వావలంబన అంశాన్ని ప్రస్తావించారు. స్వదేశీ, […]