CM Revanth Reddy: నాడు ఇద్దరు దోస్తులు గ్యారేజీలో ప్రారంభించారు.. నేడు ప్రపంచంలోనే ప్రఖ్యత కంపెనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్ట్-అప్స్ లో గూగుల్ ఒకటని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. టీ హబ్ లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మీరు యువకులు, శక్తివంతులు.. సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఈ సందర్భంగా మీకు స్పూర్తిని కలిగించే ఒక విషయం చెబుతా… ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో ఓ స్టార్ట్-అప్ ను ప్రారంభించారు. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించింది. తెలంగాణ భవిష్యత్ అభివృద్దిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ ను పరిచయం చేయాలని గత రెండు రోజులు, మనం తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామన్నారు. జాతీయ అంతర్జాతీయ కార్పోరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ కోసం మన విజన్‌ను ఆవిష్కరించామని తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పునరుద్ఘాటించారు.
READ MORE: Civil Judge Posts: తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసులో 66 సివిల్ జడ్జి పోస్టులు..
Also Read
గత 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన అనేక స్టార్ట్ అప్స్ నేడు బిలియన్ల డాలర్ల కంపెనీలుగా ఎదిగాయి. గూగుల్, ఆపిల్, అమెజాన్, టెస్లా, ఫేస్‌బుక్ ఇలాంటి గొప్ప ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. “గత 25 సంవత్సరాల్లో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో. హైదరాబాద్‌లో చాలా స్టార్ట్-అప్స్ పెద్ద కంపెనీలుగా ఎదిగాయి. తెలంగాణ రైజింగ్ విజన్ స్టార్ట్-అప్స్ కోసం మీ ప్రణాళికలు ఏంటని అడిగితే… స్టార్ట్ అప్ ని ఫుట్‌బాల్ ఆటతో పోల్చుతా. నేను ఆ ఆట ఆడతాను. ఫుట్‌బాల్‌లో సమిష్టి కృషి అవసరం. పట్టుదలతో సాధన చేయాలి. ఇది టీమ్ వర్క్. కానీ చివరకు గెలుపు చాలా ముఖ్యం. స్టార్ట్ -అప్స్ కూడా అదే విధంగా ఉండాలి. ఈ రోజు నుంచి హైదరాబాద్ ప్రోడక్ట్ బేస్డ్ స్టార్ట్ – అప్స్, ఇన్నోవేటీవ్ స్టార్ట్-అప్స్, ఐపీ ఇంటెన్సీవ్ స్టార్ట్ – అప్స్ వీటి పైనే దృష్టి పెట్టాలి. హైదరాబాద్ కేవలం స్టార్ట్ అప్ హబ్ గా ఎదగడమే కాదు. ఆ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని కోరుకుంటున్నా.. హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్ లు యూనికార్న్స్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నా.. అంటే కనీసం 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలుగా ఎదగాలి… 2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి.. అందుకోసం రాష్ట్రంలో ఒక మంచి ఎకోసిస్టమ్‌ను సృష్టించాలనుకుంటున్నాం.. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మీకు అవసరమైన సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నాయి. స్టార్టప్ ల కోసం మా ప్రభుత్వం రూ. 1000 కోట్లతో స్టార్ట్ అప్ ఫండ్ ఏర్పాటు చేస్తుంది. ఆ ఫండ్స్ ను వినియోగించుకోండి. తద్వారా స్టార్ట్ అప్ లు గూగుల్ స్థాయిలో లేదా 1 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని కోరుకుంటున్నాం..” అని సీఎం వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
-
Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?