Bigger Upgrade to Challenge Creta: హ్యూండాయ్ క్రెటా భారత్‌లో బెస్ట్‌సెల్లింగ్ SUVలలో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇతర కంపెనీలు కూడా కొత్త మోడళ్లను తీసుకువస్తుండటంతో క్రేటా పోటీ మరింత పెరుగుతోంది. తాజాగా టాటా సియెర్రా లాంచ్‌తో SUV మార్కెట్‌లో పోటీ ఇంకా పెరిగింది. దీనికి తోడు, స్కోడా సైతం తమ కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు చూస్తే ఇప్పటికీ బెంచ్‌మార్క్‌గా క్రెటా ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.
READ MORE: Health Risks of Oversleeping: రోజులో ఎక్కువ సేపు నిద్రపోతున్నారా.. అయితే జాగ్రత్త!
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ 2026 జనవరిలో విడుదలవుతుందని తెలుస్తోంది. టాటా సియెరా విడుదల తర్వాత మధ్యస్థ SUV సెగ్మెంట్‌లో పోటీకి తట్టుకోవడానికి స్కోడా ఈసారి పెద్ద మార్పులు చేస్తోంది. ఆటోకార్ తెలిపిన సమాచారం ప్రకారం.. కొత్తగా లీకైన టెస్ట్ ఫోటోల్లో ఎన్నో ఫీచర్లు కనిపించాయి. అందులో ముఖ్యంగా సెగ్మెంట్‌లో మొదటిసారి వచ్చే రియర్ సీట్ మసాజ్ ఫీచర్ ఉంది. ఇది కొనుగోలుదారులకు మరింత కంఫర్ట్ అందించనుంది. ఇంతకు ముందు లీకైన ఫోటోలలో హయ్యర్ వేరియెంట్స్‌లో పానోరమిక్ సన్‌రూఫ్ కూడా వస్తుందని తెలిసింది. ఆటోకార్ ప్రకారం.. మరిన్ని అప్‌డేట్‌లు కూడా ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్‌కు కొత్త గ్రాఫిక్స్, 1.5 TSI వేరియెంట్‌లకు రియర్ డిస్క్ బ్రేకులు, మెరుగైన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. అలాగే ఈ ఫేస్‌లిఫ్ట్‌లో లెవల్ 2 ADAS ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా కూడా రానున్నాయి. ఇవన్నీ కలిసి క్రెటా వంటి ప్రత్యర్థులపై కుషాక్‌కి మరింత బలం ఇస్తాయి.
READ MORE: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!
స్కోడా కుషాక్ ఇప్పటికే భద్రత పరంగా చాలా పేరును సంపాదించింది. గ్లోబల్ NCAP, భారత NCAP టెస్టుల్లో ఇది 5-స్టార్ రేటింగ్ పొందింది. ఇప్పుడు ADAS ఫీచర్లు జోడించడంతో రాబోయే కఠినమైన భద్రతా ప్రమాణాల్లో కూడా ఈ SUV మంచి స్థాయి దక్కించుకునే అవకాశం ఉంది. కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజిన్ ఆప్షన్లు ఇప్పటి వాటినే కొనసాగుతాయి. 115హెచ్‌పీ 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 150హెచ్‌పీ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు అలాగే ఉంటాయి. అయితే 1.0 లీటర్ ఇంజిన్‌కి ఒక ముఖ్యమైన అప్‌డేట్ రావచ్చు! ఇప్పటి 6-స్పీడ్ ఆటోమేటిక్‌కి బదులుగా కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇవ్వొచ్చు. 1.5 TSI వేరియెంట్ మాత్రం అదే 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్‌తో వస్తుంది. రెండు ఇంజిన్లకూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో కొనుగోలుదారులను ఆకర్శిస్తుంది.