YS Jagan: అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీపై మాజీ సీఎం స్పందించారు. నకిలీ లిక్కర్ తయారీలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చదిద్దాలని కంకణం కట్టుకున్నారా.? టీడీపీ నేతలు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీని పెట్టి సప్లై చేస్తున్నార అని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. నకిలీ మద్యానికి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు.
Foreign Tourist Drowns at Yarada Beach: విశాఖలో అలలు తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. యారాడ బీచ్ లో స్నానానికి దిగి అలలు ధాటికి కొట్టుకుపోయారు. ఇటలీ నుంచి 16 మంది పర్యాటకులు విశాఖకి వచ్చారు. అలలు తాకిడికి కొట్టుకుపోయి ఓ విదేశీయుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సరదాగా గడిపేందుకు వచ్చిన విదేశీయులు బీచ్‌కి వచ్చారు. సముద్ర తీరంలో ఆడుకుంటూ, తరువాత లోపలికి వెళ్ళారు. కానీ ఎప్పటికప్పుడు మారే అలల వేగాన్ని అంచనా వేయకపోవడంతో వారిని ఒక్కసారిగా అలలు…
Husband Wife Dies Same Day: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుతం యుగంలో భర్తను భార్య, భార్యను భర్త చంపుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు. కానీ.. ఇక్క మాత్రం జీవితాంతం కలిసి జీవించిన భార్యాభర్తలు మరణంలోనూ తోడుగా నిలిచారు. మొదట భార్య మరణించింది. దాదాపు 12 గంటల తర్వాత.. భర్త కూడా లోకాన్ని విడిచాడు. ఇద్దరి చితులను పక్కపక్కనే ఉంచి దహనం చేశారు. ఈ హృదయ విదారక…
Mosquitoes Prefer People Who Drink Alcohol: నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో మద్యం తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయని తేలింది. ఈ పరిశోధనను 500 మందిపైగా జనాలతో నిర్వహించారు. ఈ 500 మంది చేతులను దోమలతో నిండిన పెట్టెలో ఉంచి కెమెరాలో రికార్డ్ చేశారు. మద్యం సేవించిన వారిని 34 శాతం ఎక్కువగా దోమలు కుట్టినట్లు ఈ పరిశోధనలో తేలింది. అదే సమయంలో స్నానం చేయని, లేదా సన్‌స్క్రీన్ అప్లై చేయని, గత రాత్రి సె**క్స్ లో పాల్గొన్న వారిని ఎక్కువగా…
BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక, ఉత్తర్వులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్‌రెడ్డి సెప్టెంబరు 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఫోన్లో సంభాషించారు. సుప్రీంకోర్టు విచారణపై స్పెషల్…
Srisailam: శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవావయా, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చ జరిగింది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని…
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా పెరుపాలెం బీచ్‌లో తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలికను కేవలం ఒక గంట వ్యవధిలో గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి మొగల్తూరు పోలీసులు తమ అప్రమత్తతను చాటుకున్నారు. తమ ఫిర్యాదుపై త్వరితగతిన స్పందించి, తమ పాపను తిరిగి అప్పగించిన బీచ్ ఔట్‌పోస్ట్ పోలీసు అధికారులు, సిబ్బందికి బాలిక తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
TSRTC: టీజీఎస్ఆర్టీసీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక భారాన్ని మొయలేదు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని విధించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
MP: మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వానీ జిల్లాలోని రాజ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఖర్గోన్ నివాసి అయిన 52 ఏళ్ల పండ్ల వ్యాపారి ఇక్బాల్ ఖాన్ ఆపిల్స్‌పై మురికి మురుగు నీటిని చల్లి అమ్ముతున్నాడని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లను.. మురికి నీటితో కలుషితం చేసి హానికరంగా మార్చాడు.
UP Blast: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్లో శనివారం అకస్మాత్తుగా జరిగిన పేలుడు తీవ్ర భయాందోళనలకు దారితీసింది. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సాతాన్‌పూర్ మండి రోడ్‌లోని ఒక భవనంలో ఈ సంఘటన జరిగింది. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో భవనం పైకప్పుతో సహా అనేక భాగాలు ఎగిరిపోయాయి. సమీపంలోని ఇళ్ల అద్దాల కిటికీలు పగిలిపోయాయి. ఈ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు.…