-
Side Effects of Over Sitting: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? .. ఎంత ప్రమాదమంటే?
ఆఫీసుల్లో, ఇళ్లలో కొంత మంది కుర్చీలకు అంటి పెట్టుకున్నట్లు కూర్చుంటారు. అంతే కాదు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోతుంటారు. మీరు కూడా గంటల తరబడి ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ కూర్చుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు గంటల తరబడి కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికనట్లే అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు కూర్చున్నట్లయితే.. త్వరలో గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
Fire Accident: జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం.. కార్మికుడి మృతి.. మరో ముగ్గురి పరిస్థితి..
ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తితో పాటు ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. తాజాగా హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ఆరోరా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ లో కెమికల్ మిక్స్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో సూరారానికి చెందిన కార్మికుడు అనిల్ కుమార్ మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి.. -
Winter Foods to Eat: చల్లగా ఉందని వేడి వేడిగా బజ్జీలు, పకోడీలు చిరుతిళ్లు లాగిస్తున్నారా?
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది. -
CM Revanth Reddy: వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి వేములవాడలో పర్యటిస్తున్నారు. వేముల వాడకు చేరుకున్న సీఎంకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జ్ఞాపికను అందించారు. రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం స్వామి వారికి కోడే మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి స్వామికి మొక్కులు చెల్లించి పూజలో పాల్గొన్నారు. నంది దర్శనం చేసుకున్నారు. రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర […] -
Forgery Ginger Garlic Paste: హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ.. 50 కేజీల సింథటిక్ ఫుడ్ కలర్ స్వాధీనం
తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నాణ్యత పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా కాటేదాన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న తయారీ సంస్థపై దాడులు చేశారు. సింతటిక్ కలర్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. SKR, ఉమాని సంస్థల్లో అక్రమంగా నిల్వ చేసిన 1400 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను గుర్తించి… -
Kolkata Model Dancing Video: ఇండియా గేట్ వద్ద.. బట్టల్లేకుండా డ్యాన్స్ చేసిన కోల్‌కతా మోడల్..(వీడియో)
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కోల్‌కతా మోడల్ తెల్లటి టవల్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. మోడల్ సన్నతి మిత్రా.. టవల్లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి ఇన్స్టాగ్రామ్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. మిస్ కోల్‌కతా పోటీలో 2017 విజేతగా సన్నతి పేర్కొంది. -
Retirement Age: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచారంటు వస్తున్న వార్తల్లో నిజమెంత?
కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా వయో పరిమితిని పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. విచారణలో ఈ వాదన తప్పు అని తేలింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని తెలిసింది. -
CM Revanth Reddy: రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం వరాల జల్లు.. ఏకంగా రూ. 694.50 కోట్లతో..
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి వేములవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేస్తారు. రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు, రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ… -
Hyderabad: బయటపడ్డ అధికారుల నిర్లక్ష్యం?.. భవనాలన్నీ పర్మిషన్ లేకుండా నిర్మించినవే..
కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్లో కుంగిన భవనం వెనుక టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రస్తుతం ఒరిగిన భవనంతో పాటు.. ఆ చుట్టూ ప్రక్కల ఉన్న భవనాలు అన్నింటినీ పర్మిషన్ లేకుండా నిర్మించినవే అని తేలింది. 50 నుంచి 100 గజాల లోపు ఉన్న చిన్న స్థలాల్లో 4, 5 అంతస్తుల నిర్మాణం చేపట్టారు భవన యజమానులు. నిర్మాణ సమయంలో ముడుపులు అందుకుని సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. భవన యజమానులు ఒక్కో అంతస్తుకు అనుమతి తీసుకుని నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. -
Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్..
సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. "కేసీఆర్ మర్రిచెట్టు.. నువ్వు గంజాయి మొక్క. నన్ను రాక్షసుడు అంటున్నావ్.. ప్రజల కోసం నేను రాక్షసుడినే. నిన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడని ఆశ ఉండే. అబద్ధాలు, ప్రమాణాలు చేసి రేవంత్ అధికారంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి చీటర్, అబద్ధాల కోరు. తెలంగాణ ద్రోహి. తెలంగాణా కోసం నువ్వేం చేశావ్.. తెలంగాణా కోసం టీడీపీలో ఉన్న అందరం రాజీనామా చేస్తే నువ్వు తప్పించుకు పోయావ్. కాళోజీ నారాయణరావు…
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!