స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ గురించి తెలిసే ఉంటుంది. జెరోధా సీఈఓ నితిన్ కామత్‌కు ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ ఓ ప్రశ్న సంధించారు. “భారతీయులు ధనవంతులను ఎందుకు ద్వేషిస్తారు?” అని అడిగారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. “అమెరికాలో ఎవరైనా బాగా డబ్బు సంపాదిస్తే, అతను చాలా విజయవంతమై కొత్త కార్లు కొంటే, అది కవర్ పేజీలో ముద్రించబడుతుంది. ఇది చాలా సాధారణమైనది. ఒక జెట్ విమానం కొనుగోలు చేసినా చాలా సాధారణమైనదిగానే పరిగణిస్తారు. సమాజం ధనవంతులను చిన్నచూపు చూడదు. అమెరికా స్వచ్ఛమైన పెట్టుబడిదారీ సమాజం. మనది పెట్టుబడిదారీ ముసుగులో ఉన్న సోషలిస్టు సమాజం. భారతీయ సమాజంలో పాతుకుపోయిన “సోషలిస్ట్ మనస్తత్వం” ధనికుల పట్ల శత్రుత్వానికి కారణమని అన్నారు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Mohamed Muizzu: భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు.. 5 రోజులు ముయిజ్జు పర్యటన
దీనిపై అని సోషల్ మీడియా వేదికగా బిలియనీర్ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా చాలా సీరియస్‌గా స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జెరోధా సీఈఓ మాట్లాడిన ఫుటేజీని షేర్ చేస్తూ.. గోయెంకా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఇదిగో నా దృక్పథం: భారతీయులు రతన్ టాటా, అజీమ్ ప్రేమ్‌జీ, ఆనంద్ మహీంద్రా వంటి మంచి బిలియనీర్‌లను ఆదరిస్తారు. వారు వారి వినయం, దాతృత్వం, మంచి విలువలు కలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్లని ప్రేమిస్తారు. అనుకరిస్తారు. సంపదను చాటుకునే, వ్యవస్థను భ్రష్టుపట్టించే, సామాజిక మంచి కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు ఇష్టపడరు.” అని సమాధానమిచ్చారు.